Gold Price Today: పతనమవుతున్న పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

|

Jun 21, 2021 | 5:40 AM

Today Gold Rates: దేశంలో కరోనా విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. పసిడి ధరలకు ఏమాత్రం బ్రేక్ పడటంలేదు. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన ధరలు కాస్త.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం

Gold Price Today: పతనమవుతున్న పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Gold Price Today
Follow us on

Today Gold Rates: దేశంలో కరోనా విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. పసిడి ధరలకు ఏమాత్రం బ్రేక్ పడటంలేదు. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన ధరలు కాస్త.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అయితే.. గత వారం నుంచి బంగారం ధర పతనమవుతూ వస్తోంది. బులియన్ మార్కెట్‌ ప్రకారం.. ప్రతిరోజూ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. ఒక రోజు ధరలు తగ్గితే.. మరోకరోజు పెరుగుతుంటాయి. దీంతో బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టిసారిస్తుంటారు. అయితే.. తాజాగా సోమవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. కొన్ని చోట్ల తగ్గితే.. మరికొన్నిచోట్ల ధరలు స్థిరంగానే ఉన్నాయి. శనివారం 22 క్యారెట్ల తులం బంగారం ధర.. రూ. 46,220 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 47,220 ఉంది. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,140 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 50,330 గా ఉంది.
ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,220 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 47,220 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,990 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 47,990 వద్ద ఉంది.
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,290 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,290 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,990 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.47,990 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,990 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.47,990 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,990 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 47,990 వద్ద కొనసాగుతోంది.

Also Read:

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఆ ముగ్గురు చైనా వ్యోమగాములకు రోజూ ‘పండగే ‘ ! వారు ఏం తింటారంటే …?

KK Shailaja: కేరళ మాజీ మంత్రి శైలజా టీచర్‌కు అంతర్జాతీయ అవార్డు.. ‘ఓపెన్‌ సొసైటీ ప్రైజ్‌’