Gold Price Today: లాక్‌డౌన్ సమయంలో బంగారం ధరలు ఓ రేంజ్‌లో పెరిగిన విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో తులం బంగారం ఏకంగా రూ.55 వేల వరకు చేరుకుంది. ఆకాశమే హద్దుగా పెరిగిన ధరలను చూసి సామాన్యులు భయాందోళనకు గురయ్యారు. అయితే తదనంతరం జరిగిన పరణామాల తర్వాత గోల్డ్ ధరలు తగ్గుతూ వచ్చాయి. రూ.55 వేల నుంచి రూ.47 వేల వరకు చేరుకుంది. ఇదిలా ఉంటే నేల చూపులు చూస్తోన్న గోల్డ్ ఇటీవల మళ్లీ పెరుగుతోంది. అయితే పెద్ద మొత్తంలో కాకుండా చాలా స్వల్పంగా పెరుగుతోంది. ఆదివారం సుమారు రూ.100కిపైగా పెరిగిన గోల్డ్ ధరల్లో సోమవారం కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. మరి ఈ రోజు దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర ఆదివారంతో పోల్చితే రూ.10 పెరిగి 10 గ్రాముల బంగారం రూ.44,160 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ ధర కూడా 10 రూపాయలు పెరిగి రూ. 48,170గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయి కూడా ఇదే పెరుగుదల కనిపంచింది. సోమవారం ముంబయిలో పది గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రూ. 43,870 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.44,870 వద్ద కొనసాగుతోంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 42,010గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 45,830 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.42,010 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.45,830గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇక దక్షిణ భారతదేవశంలో మరో ముఖ్య నగరమైన చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.42,310 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.46,160 వద్ద కొనసాగుతోంది.
Also Read: SBI Marriage Loan : మీ ఇంట్లో వివాహ వేడుకకి నగదు తగ్గిందా..! అటువంటి వారికోసమే ఎస్బిఐ బంపర్ ఆఫర్