
భారతదేశంలో బంగారం ధరలు రోజు రోజుకు మిన్నంటుతున్నాయి. నిత్యవసర ధరలు పెరిగిపోయినట్లు నిత్యం పసిడి ధర పరుగులు తీస్తోంది. దీంతో ఆభరణాలు కొనాలనుకునే వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పెట్టుబడులు పెట్టాలనుకునే వారైతే ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తూ కాలం గడుపుతున్నారు. ఇలా ఆందోళన, ఆలోచన మధ్య ఊగిసలాడిస్తోంది బంగారం ధర. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లలో ఎదురవుతున్న ఆర్థిక పరిస్థితులు, యుద్ద ప్రభావాలు, వడ్డీ రేట్లలో వచ్చిన కీలక మార్పులు, డాలర్ విలువలో నెలకొన్న హెచ్చుతగ్గులే ప్రధాన కారణంమంటున్నారు నిపుణులు. ఈ ధరలు మరి కొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు బిజినెస్ అనలిస్టులు. ఇక హైదరాబాద్లో నిన్నటి ధరతో పోలిస్తే తులంపై మరో రూ. 10 పెరిగింది. ఈరోజు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 73,320గా ఉంది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం 10 గ్రాముల ధర రూ. 67,210 వద్ద కొనసాగుతోంది. ఇక కిలో వెండి విషయానికి వస్తే.. హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 90వేల మార్క్ దాటి రూ. 90,100 కు చేరింది. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో వెండి ధరలు పెరగడం ఇదే తొలిసారి. దీనిని ఆల్ టైం రికార్డుగా చెప్పవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..