Gold Price Today: గత వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. దేశంలో వరుసగా రెండు రోజులుగా గోల్డ్ ధరల్లో మార్పులు కనిపించడంలేదు. ఆదివారం గోల్డ్ ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేదు. ఇక సోమవారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో నమోదైన 10 గ్రాముల బంగారం ధర ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 46,900గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ రూ. 50,950 వద్ద కొనసాగుతోంది.
* ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 46,810 వద్ద కొనసాగుతుండగా 24 క్యారెట్ల గోల్డ్ రూ. 47,810గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 45,260గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,380గా నమోదైంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 44,750 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,820గా ఉంది.
* హైదరాబాద్‌లో సోమవారం బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,750గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,820 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,750 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,820 గా నమోదైంది.
* ఇక సాగర నగరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 44,750 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,820గా ఉంది.
Also Read: Google pay: గూగుల్ పే ద్వారా రోజుకు ఎంత డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చో తెలుసా…