Gold Price Today: బంగారం వినియోగ‌దారులకు భారీ ఊర‌ట‌.. తులం బంగారంపై ఎంత ధ‌ర త‌గ్గిందో తెలుసా..?

|

Jun 05, 2021 | 6:47 AM

Gold Price Today: బంగారాన్ని కోనుగోలు చేయాల‌నుకుంటున్నారా.? అయితే ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని చెప్పాలి. ఎందుకంటే గ‌త కొన్ని రోజులుగా స్వ‌ల్ప హెచ్చుత‌గ్గుద‌ల‌తో కొన‌సాగుతోన్న బంగారం ధ‌ర‌లు....

Gold Price Today: బంగారం వినియోగ‌దారులకు భారీ ఊర‌ట‌.. తులం బంగారంపై ఎంత ధ‌ర త‌గ్గిందో తెలుసా..?
Gold Price 05 06 2021
Follow us on

Gold Price Today: బంగారాన్ని కోనుగోలు చేయాల‌నుకుంటున్నారా.? అయితే ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని చెప్పాలి. ఎందుకంటే గ‌త కొన్ని రోజులుగా స్వ‌ల్ప హెచ్చుత‌గ్గుద‌ల‌తో కొన‌సాగుతోన్న బంగారం ధ‌ర‌లు. శ‌నివారం భారీగా త‌గ్గుముఖం ప‌డ్డాయి. ఇటీవ‌లి కాలంలో ఎన్న‌డూ లేని విధంగా హైద‌రాబాద్‌లో తులం బంగారంపై ఏకంగా రూ. 700కిపై త‌గ్గింది. శ‌నివారం దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో 10 గ్రాముల 22 క్యారెట్‌, 24 క్యారెట్ల గోల్ఢ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

* దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 46,700 వ‌ద్ద ఉండ‌గా (శుక్ర‌వారం రూ. 47,100), 24 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 50,900 (శుక్ర‌వారం రూ. 51,350 ) వ‌ద్ద కొన‌సాగుతోంది.

* ఇక దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 47,960 కాగా (శుక్ర‌వారం రూ. 48,230 ), 24 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 48,960 (శుక్ర‌వారం రూ. 49,230) గా ఉంది.

* త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 45,850 వ‌ద్ద ఉండ‌గా (శుక్ర‌వారం రూ. 46,550 ), 24 క్యారెట్ల రేట్ రూ. 50,000 (శుక్ర‌వారం రూ. 50,790 ) వ‌ద్ద కొన‌సాగుతోంది.

* క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 45,500 వ‌ద్ద ఉండ‌గా (శుక్ర‌వారం రూ. 46,200 ), 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 49,640 (శుక్ర‌వారం రూ. 50,400 )గా ఉంది.

తెలుగు రాష్ట్రాల విష‌యానికొస్తే..

* హైద‌రాబాద్‌లో బంగారం ధ‌ర‌లో భారీగా త‌గ్గుద‌ల క‌నిపించింది. ఇక్క‌డ 22 క్యారెట్ల 10 గ్రాములు గోల్డ్ ధ‌ర రూ. 45,500 గా ఉండ‌గా (శుక్ర‌వారం రూ. 46,200 ), 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,640 (శుక్ర‌వారం రూ. 50,400 ) వ‌ద్ద కొన‌సాగుతోంది.

* విజ‌య‌వాడ‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 45,500 ఉండ‌గా (శుక్ర‌వారం రూ. 46,200 ), 24 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 49,640 (శుక్ర‌వారం రూ. 50,400 ) వ‌ద్ద కొన‌సాగుతోంది.

* ఇక సాగ‌ర న‌గ‌రం విశాఖ‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 45,500 కాగా (శుక్ర‌వారం రూ. 46,200 ), 24 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 49,640 (శుక్ర‌వారం రూ. 50,400) వ‌ద్ద కొన‌సాగుతోంది.

Also Read: Viral Video: తన పెళ్లి బరాత్‌లో తానే డ్యాన్స్ వేసిన వరుడు.. చూస్తే నవ్వు ఆపుకోలేరు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

Agriculture: ఖరీఫ్ సీజన్లో ఈ పంటలు పండిస్తే.. మీ పంట పండినట్లే.. ఎకరా సాగుతో లక్షల్లో లాభం..

Santosh Shoban: జోరు పెంచిన కుర్రహీరో.. వరుస సినిమాలతో బిజీబిజీ.. త్వరలో ప్రేమ్ కుమార్ గా ప్రేక్షకుల ముందుకు..