Gold: కుప్పకూలనున్న బంగారం ధరలు.. తొందరపడి ​కొంటే తలపట్టుకోవాల్సిందే! వెలుగులోకి సంచలన రిపోర్ట్‌

బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. 2025-26లో వృద్ధి చూసినా, గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక సంచలనం రేపింది. 2026 నాటికి ధరలు కుప్పకూలవచ్చని హెచ్చరించింది. విధాన అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు ధరలను కొనసాగించవచ్చు. కానీ పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగితేనే భారీ పతనం ఖాయమని నివేదిక పేర్కొంది.

Gold: కుప్పకూలనున్న బంగారం ధరలు.. తొందరపడి ​కొంటే తలపట్టుకోవాల్సిందే! వెలుగులోకి సంచలన రిపోర్ట్‌
Gold 2

Updated on: Jan 24, 2026 | 7:42 PM

ప్రస్తుతం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 2025 ఏడాది స్వర్ణానికి స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. 2026లో బంగారం దూకుడు ఏ మాత్రం తగ్గలేదు. దీంతో చాలా మంది బంగారంపై పెట్టుబడి పెట్టారు. దాంతో డిమాండ్‌ మరింత పెరిగి, ధర ఆకాశాన్ని తాకింది. ఆల్‌టైమ్‌ రికార్డు ధరలను నెలకొల్పుతూ గోల్డ్‌ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఓ సంచలన రిపోర్ట్‌ వచ్చింది. బంగారం ధర కుప్పకూలుతుందని ఆ రిపోర్ట్‌ పేర్కొంది.

రూపాయి రికార్డు స్థాయిలో కనిష్టానికి పడిపోవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) భారత మార్కెట్ల నుంచి డబ్బును ఉపసంహరించుకోవడం, రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) వంటి హెవీవెయిట్ కంపెనీల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, అలాగే గ్రీన్‌ల్యాండ్ చుట్టూ పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. ఇవన్నీ కలిసి పెట్టుబడిదారుల్లో అనిశ్చితిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో గోల్డ్‌మన్ సాచ్స్ తాజా నివేదికను వెల్లడించింది.ఈ బ్రోకరేజ్ సంస్థ 2026 చివరి నాటికి బంగారం ధర ఔన్సుకు 5,400 డాలర్లుగా అంచనా వేసింది.

బంగారం ధరల పెరుగుదలకు ప్రైవేట్ రంగ డిమాండ్ అని గోల్డ్‌మన్‌ సాచ్స్‌ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా విధాన అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని హెడ్జ్‌గా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా 2026 వరకు ఈ డిమాండ్ తగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంచనా. దీని ఫలితంగా బంగారం ధరలు మునుపటి అంచనాల కంటే వేగంగా పెరిగి, దీర్ఘకాలిక బేస్ లెవెల్‌ను ఎత్తుకు తీసుకెళ్తున్నాయి. అదేవిధంగా పాశ్చాత్య మార్కెట్ల నుంచి కూడా మద్దతు వచ్చే అవకాశముంది. ఫెడరల్ రిజర్వ్ రాబోయే కాలంలో వడ్డీ రేట్లను సడలించే దిశగా అడుగులు వేస్తుందని గోల్డ్‌మన్ భావిస్తోంది. 2026లో దాదాపు 50 బేసిస్ పాయింట్ల రేటు కోత జరిగే అవకాశముందని అంచనా. సాధారణంగా ఈ తరహా వాతావరణం బంగారం వంటి దిగుబడి లేని ఆస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఇక కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు కూడా మరో కీలక అంశంగా చెప్పవచ్చు.

2026లో సగటున 60 టన్నుల బంగారం కొనుగోళ్లు జరగవచ్చని గోల్డ్‌మన్ అంచనా వేసింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ శక్తి సమీకరణాల్లో మార్పుల నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు తమ రిజర్వులను వైవిధ్యపరచాలని చూస్తున్నాయి.ఇక ప్రపంచ ద్రవ్య విధానాలపై అనిశ్చితి గణనీయంగా తగ్గితే, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగే అవకాశం ఉంది. అదే జరిగితే బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని గోల్డ్‌మన్ అంచనా వేస్తోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి