Gold Price april 26th 2021: పసిడి ప్రేమికులకు శుభవార్త.. బంగారం ధరలు మరోసారి దిగొచ్చాయి. సోమవారంం ఉదయం పసిడి ధరలు నేలచూపులు చూసాయి. ఎప్పటి నుంచో బంగారం కొనాలని ఎదురుచూస్తున్నవారికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. దేశీయ మార్కెట్లో ఇవాళ ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,940 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.45,940గా ఉంది.
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలలో బారీగానే మార్పులు జరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.45,590 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,650గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,240 ఉంటే.. 10 గ్రాముల 24 క్యారెట్ల రేట్ రూ.50,460గా ఉంది. ఇక దేశీయ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,940 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.45,940గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,760 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల రేట్ రూ.48,830 గా ఉంది. ఇక అటు విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.45,590 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,650గా ఉంది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో గత రెండు రోజులుగా పసిడి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేట్లు పెరిగిపోవడం ఇందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు.
Also Read: SBI ఖాతాదారులరా అలర్ట్.. కస్టమర్లకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్.. ఏం చెప్పిందంటే..
సుకన్య సమృద్ధి యోజన 2021: పోస్టాఫీసులో వడ్డీ రేట్లు చెక్ చేయండిలా.. ప్రయోజనాలెంటో తెలుసా..