Gold Price : ఏడాదిలో 10 గ్రా. 11వేలు తగ్గిన పసిడి ధర.. ఇంకా తగ్గుతాయా..? పెరుగుతాయా..? నిపుణులు ఏమంటున్నారంటే..!

|

Apr 02, 2021 | 6:08 PM

Gold Price May Fall: బంగారానికి భారతీయ మహిళలకు అవినాభావ సంబంధం ఉంది. ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా బంగారం, వెండి లోహాలది ప్రత్యేక స్థానం. అయితే గత ఆర్ధిక ఏడాదిలో బంగారం ధర 10 గ్రాములకి రూ. 43000 వద్ద ప్రారంభమైంది..

Gold Price : ఏడాదిలో 10 గ్రా. 11వేలు తగ్గిన పసిడి ధర.. ఇంకా తగ్గుతాయా..? పెరుగుతాయా..? నిపుణులు ఏమంటున్నారంటే..!
Gold Price
Follow us on

Gold Price May Fall: బంగారానికి భారతీయ మహిళలకు అవినాభావ సంబంధం ఉంది. ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా బంగారం, వెండి లోహాలది ప్రత్యేక స్థానం. అయితే గత ఆర్ధిక ఏడాదిలో బంగారం ధర 10 గ్రాములకి రూ. 43000 వద్ద ప్రారంభమైంది. అయితే కరోనా వెలుగులోకి వచ్చిన తరవాత రికార్డు స్థాయిలో 10 గ్రాముల బంగారం ధర రూ. 56000 లకు చేరుకుంది. అయితే గత కొన్ని నెలలుగా పసిడి ధరలో హెచ్చుతగ్గులున్నా ఇప్పుడు పది గ్రాములు రూ. 44000 సమీపంలో ఉంది.

COVID-19 వెలుగులోకి వచ్చిన సమయంలో వాణిజ్య విపణిలో బంగారం పై పెట్టుబడిపై ముదుపరులు ఆసక్తి చూపించారు. ఇక పసిడి వాణిజ్య వస్తువుగా మారి ధర జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టింది. అయితే గత కొన్ని నెలలుగా మళ్ళీ మార్కెట్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా COVID-19 వ్యాక్సిన్ మార్కెట్లోకి రావడం..ప్రభుత్వ చర్యలతో క్రమంగా దిగి వస్తుంది.

గత ఏడాది రికార్డు స్థాయిలో రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు, ఈ ఏడాది ఊహించని స్థాయిలో పడిపోతోంది. 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఏడాది పది గ్రాములకు రూ. 11,000 తగ్గింది. బంగారం ధర గత ఆగస్టులో 10 గ్రాములకు రూ .54,750 వద్ద రికార్డు స్థాయిని తాకింది. దేశ రాజదాని డిల్లీలో ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు రూ .43,590. ఈ విధంగా, గత ఏడు నెలల్లో 10 గ్రాముల బంగారం ధర రూ .11,160 పతనమయ్యింది.

ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. అయితే ప్రస్తుతం మార్కెట్లో వెండి ధర కూడా పడిపోతుంది. 2021 ఫిబ్రవరి 1 న కిలో వెండి ధర రూ .73,300 ఉండగా అదే మార్చి 6 నాటికి కిలోకు రూ .65,700 కు పడిపోయింది. పారిశ్రామిక వినియోగానికి డిమాండ్ తగ్గడమే వెండి ధర తగ్గడానికి కారణంగా మార్కెట్ వర్గీయులు చెబుతున్నారు.

అయితే బంగారం ధర తగ్గుతుండడంతో.. బ్యాంక్ లో బంగారాన్ని తనఖా పెట్టిన వినియోగదారులను.. ఎక్కువ బంగారాన్ని జమ చేయాలని లేదా బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకున్న రుణంలో కొంత భాగాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి.

Also Read: చిలక ముక్కు, పొడవైన తోకతో అందాలపోటీకి సై అంటున్న ఈ కోళ్లు.. గుడ్డు వెయ్యి, కోడి ధర ఐదులక్షలు…

త్వరలో టాలీవుడ్‌లో మరో హీరో ఇంట్లో మోగనున్న పెళ్లి బాజాలు ..