Gold Price Today: తగ్గిన పసిడి ధరలు.. భారీగా పెరిగిన వెండి.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

పసిడి ప్రియులకు ఊరట లభిస్తోంది. బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజుల నుంచి పరుగులు పెడుతున్న బంగారం ధరలకు బ్రేక్‌ పడుతోంది. వరుసగా రెండో రోజు కూడా పసిడి ధరలు తగ్గాయి. మంగళవారం 24 క్యారెట్ల తులం గోల్డ్‌పై రూ. 150 తగ్గగా, ఇవాళ (ఫిబ్రవరి 15) మరో రూ.70 తగ్గింది

Gold Price Today: తగ్గిన పసిడి ధరలు.. భారీగా పెరిగిన వెండి.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
Gold Price Today

Updated on: Feb 18, 2023 | 6:05 AM

పసిడి ప్రియులకు ఊరట లభిస్తోంది. బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజుల నుంచి పరుగులు పెడుతున్న బంగారం ధరలకు బ్రేక్‌ పడుతోంది. వరుసగా రెండో రోజు కూడా పసిడి ధరలు తగ్గాయి. మంగళవారం 24 క్యారెట్ల తులం గోల్డ్‌పై రూ. 150 తగ్గగా, ఇవాళ (ఫిబ్రవరి 15) మరో రూ.70 తగ్గింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.100 తగ్గడం విశేషం. మారిన ధరలతో ప్రస్తుతం దేశంలోని బులియన్ మార్కెట్ లో  22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.52,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,160 గా ఉంది. అయితే వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. కిలో వెండిపై రూ.400 పెరగడం విశేషం. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.70,400 పలుకుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం ముఖ్యం.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,240 ఉంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160గా ఉంది.

ఇవి కూడా చదవండి

* విశాఖటపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160గా ఉంది.

ప్రధాన నగరాల్లో..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160 ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,540 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160గా ఉంది.

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,140గా ఉంది.

* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,210 ఉంది.

వెండి ధరలు పైపైకి..

పెరిగిన ధరలతో ఢిల్లీలో కిలో వెండి ధర రూ.70,400 లుగా ఉంది. ముంబై, కోల్‌కతా నగరాల్లోనూ ఇదే ధర పలుకుతోంది. ఇక చెన్నై, బెంగళూరు, లో రూ. 72,500 ఉండగా, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర రూ.72,500 పలుకుతోంది.

 

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం.. క్లిక్ చేయండి..