Gold Facts: పసిడి ప్రియులు మస్ట్‌గా తెలుసుకోవాల్సిన పచ్చి నిజాలు.. అప్పుడే పట్టిందల్లా బంగారం..!

బడ్జెట్ తర్వాత బంగారం ధర దాదాపుగా ఆరున్నర లక్షలు తగ్గింది. ఆశ్చర్యంగా ఉంది కదా. కిలో బంగారం ధర ఆరు లక్షల 20వేలు తగ్గింది. కారణం.. బడ్జెట్‌లో బంగారంపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ తగ్గించడమే. ఇన్నాళ్లు పసిడిపై సుంకం భారం 15 శాతం ఉండేది. దీన్ని ఆరు శాతానికి తగ్గించారు. అలా తగ్గించారో లేదో పది గ్రాముల బంగారం ధర రమారమి నాలుగు వేల రూపాయలు తగ్గింది.

Gold Facts: పసిడి ప్రియులు మస్ట్‌గా తెలుసుకోవాల్సిన పచ్చి నిజాలు.. అప్పుడే పట్టిందల్లా బంగారం..!
Gold Myths And Facts

Edited By: Ravi Panangapalli

Updated on: Aug 06, 2024 | 10:28 AM

“బంగారం ధర తగ్గుతోందట వదిన”. మగువల మోములో చిరునవ్వు తొంగిచూడడానికి ఈ ఒక్కమాట చాలు. అసలా ఆ ఆనందం వెలకట్టలేనిది. ఇంటాయన జేబుకు చిల్లు పడడం తరువాత సంగతి. ముందైతే కొనేద్దాం అనే అనుకుంటారు. “తరుగుటయే ఎరుంగని” అన్నట్టు పెరగడమే తప్ప తగ్గడం అన్నదే తనకు తెలియదన్నట్టుగా పెరుగుతూ పోతోంది పసిడి. పది గ్రాముల బంగారం 30వేలు దాటిన తరువాత.. యమ స్పీడ్‌ అందుకుంది. చూస్తుండగానే 50వేలు దాటేసింది. త్వరపడి పట్టుకునేలోపు 75వేలకు పెరిగి కూర్చుంది. ఇంకేముంది.. కనకం హొయలు లకారానికి పోయినా ఆశ్చర్యం లేదన్నట్టుగా మెంటల్‌గా ఫిక్స్‌ చేస్తూ వెళ్లిపోతోంది. సరిగ్గా అలాంటి సమయంలో పుత్తడి బొమ్మను కిందకు దింపి మధ్యతరగతి చేతికి అందించారు నిర్మలమ్మ. బడ్జెట్ తర్వాత బంగారం ధర దాదాపుగా ఆరున్నర లక్షలు తగ్గింది. ఆశ్చర్యంగా ఉంది కదా. కిలో బంగారం ధర ఆరు లక్షల 20వేలు తగ్గింది. కారణం.. బడ్జెట్‌లో బంగారంపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ తగ్గించడమే. ఇన్నాళ్లు పసిడిపై సుంకం భారం 15 శాతం ఉండేది. దీన్ని ఆరు శాతానికి తగ్గించారు. అలా తగ్గించారో లేదో పది గ్రాముల బంగారం ధర రమారమి నాలుగు వేల రూపాయలు తగ్గింది. ఓస్‌.. నాలుగు వేలేనా అనుకోకండి. ఇది ఇంకాస్త తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎలా తగ్గుతుందో చెప్పి కన్ఫ్యూజ్‌ చేయడం కంటే.. సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే.. బంగారు నగలు కొనుక్కునే సమయానికి ఇప్పుడున్న రేటు కంటే ఏకంగా 9...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి