AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Loan: గోల్డ్ లోన్ బెటరా..? లేదా ఒకేసారి అమ్మి డబ్బు తీసుకోవడం మంచిదా..? మీరు లాభపడాలంటే ఇలా చేయండి..

చాలామంది ఆర్ధిక అవసరాల కోసం గోల్డ్ లోన్ తీసుకోవడం లేదా బంగారం అమ్మి డబ్బులు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ రెండిటిల్లో ఏది మంచిదనే విషయంలో చాలామంది కంగారు పడుతూ ఉంటారు. అయితే ఈ రెండిటిల్లో ఏది మంచిదంటే..?

Gold Loan: గోల్డ్ లోన్ బెటరా..? లేదా ఒకేసారి అమ్మి డబ్బు తీసుకోవడం మంచిదా..? మీరు లాభపడాలంటే ఇలా చేయండి..
Gold Loan
Venkatrao Lella
|

Updated on: Jul 13, 2026 | 12:37 PM

Share

గతంతో పోలిస్తే గత ఏడాది కాలంలో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో గోల్డ్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. బంగారం ధరలు పెరగడంతో గోల్డ్ లోన్లు తీసుకునేవారు కూడా పెరిగిపోతున్నాయి. ధరలు పెరగడంతో గోల్డ్ లోన్ కూడా పెద్ద మొత్తంలో వస్తుంది. ఆర్ధిక అవసరాల కోసం తమ ఇంట్లోని బంగారం తాకట్టు పెట్టి బ్యాంకులు లేదా ఆర్ధిక సంస్థల నుంచి రుణం తీసుకునేవారు పెరిగిపోయారు. కొంతమంది అత్యవసర సమయాల్లో తమ ఇంట్లోని బంగారాన్ని విక్రయించి డబ్బులు తీసుకుంటారు. అయితే గోల్డ్ లోన్ మంచిదా.. లేదా గోల్డ్ విక్రయించడం మంచిదా అనే సందేహాం చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ లోన్ తీసుకుంటే వడ్డీతో పాటు తీసుకున్న మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండిటిల్లో ఏది బెటర్ అనేది చూద్దాం.

గోల్డ్ లోన్ తీసుకుంటే..

బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకోవడం మంచిదా.. లేదా బంగారం అమ్మి ఒకేసారి డబ్బు తీసుకోవడం సరైన ఎంపికనా? ఏది మంచి మార్గం అనేది మీ ఆర్థిక అవసరాలు, తిరిగి చెల్లించే సామర్థ్యం, భవిష్యత్ ప్రణాళికలపై ఆధారపడి ఉంటుంది. బంగారు రుణం తీసుకోవడం అంటే, మీరు మీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి దానిపై డబ్బు అప్పుగా తీసుకోవడం. రుణం తిరిగి చెల్లించే వరకు ఆ ఆభరణాలు రుణదాత వద్దే ఉంటాయి. అంతేకాకుండా మీరు తీసుకున్న సొమ్ము కంటే వడ్డీ రూపంలో అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో రుణం తిరిగి కట్టకపోతే జరిమానాలతో పాటు సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపే అవకాశముంది. మీరు తిరిగి కట్టకపోతే బంగారాన్ని వేలం నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీ బంగారాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. స్వల్పకాలిక నిధులు అవసరమై తమ బంగారాన్ని కోల్పోవడం ఇష్టం లేనివారికి ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు.

బంగారం విక్రయించడం సరైనదేనా..?

ఇక బంగారం అమ్మడం ద్వారా తక్షణమే డబ్బు లభిస్తుంది. రుణం తరహాలో తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే మీరు ఆ ఆభరణాలపై యాజమాన్యాన్ని శాశ్వతంగా కోల్పోతారు. ఒకవేళ ఆ ఆభరణాలు ఇకపై అవసరం లేకపోయినా, భవిష్యత్తులో వాటిని తిరిగి కొనుగోలు చేసే ప్రణాళిక లేకపోయినా అమ్మడమే ఒక మంచి ఎంపిక కావచ్చని నిపుణులు అంటున్నారు. ప్రతి ఒక్కరికీ ఒకే ఎంపిక సరైనది కాదు. బంగారం మీ వద్దే ఉండాలనుకుంటే గోల్డో లోన్ తీసుకోండి. భవిష్యత్తులో తిరిగి చెల్లించే భారం లేకుండా మీకు డబ్బు అవసరమైతే అమ్మడం మంచి ఎంపికగా చెప్పవచ్చు.

Follow Us