Telugu News Business Gold like offer on gold, In the case of loan, those precautions must be taken, Gold Interest Rates details in telugu
Gold Interest Rates: బంగారంపై బంగారులాంటి ఆఫర్.. లోన్ విషయంలో ఆ జాగ్రత్తలు మస్ట్
భారతదేశంలో పెద్ద ఎత్తున బంగారం దిగుమతి చేసుకుంటూ ఉంటారు. అయితే అనుకోని అవసరాల నుంచి రక్షణగా బంగారం నిలుస్తుంది. ముఖ్యంగా బంగారం ద్వారా రుణాలను తీసుకోవడం సులువుగా ఉంటుంది. బంగారు రుణాలు సరళమైన విధానాన్ని అందిస్తాయి. గోల్డ్ లోన్‌తో మీరు మీ బంగారు ఆభరణాలు లేదా ఆభరణాలను భద్రత కోసం ఏదైనా బ్యాంకు వద్ద తాకట్టు పెట్టవచ్చు. మీరు బ్యాంకులు విక్రయించే నాణేలతో సహా బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి కనీస రాతపని, సరసమైన వడ్డీ రేటుతో బంగారు రుణాన్ని పొందవచ్చు.
భారతదేశంలో బంగారం కొనుగోలు అనేది అధిక సంఖ్యలో ఉంటుంది. ప్రపంచంలో ఒక్క భారతదేశంలోనే బంగారాన్ని పెట్టుబడిగా కాకుండా ఆభరణాలుగా వాడతారు. అధిక జనాభా నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. అందువల్ల భారతదేశంలో పెద్ద ఎత్తున బంగారం దిగుమతి చేసుకుంటూ ఉంటారు. అయితే అనుకోని అవసరాల నుంచి రక్షణగా బంగారం నిలుస్తుంది. ముఖ్యంగా బంగారం ద్వారా రుణాలను తీసుకోవడం సులువుగా ఉంటుంది. బంగారు రుణాలు సరళమైన విధానాన్ని అందిస్తాయి. గోల్డ్ లోన్‌తో మీరు మీ బంగారు ఆభరణాలు లేదా ఆభరణాలను భద్రత కోసం ఏదైనా బ్యాంకు వద్ద తాకట్టు పెట్టవచ్చు. మీరు బ్యాంకులు విక్రయించే నాణేలతో సహా బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి కనీస రాతపని, సరసమైన వడ్డీ రేటుతో బంగారు రుణాన్ని పొందవచ్చు. గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు సాధారణంగా 8.25 శాతం నుంచి 18 శాతం వరకు మారుతూ ఉంటాయి. రుణదాతను బట్టి తిరిగి చెల్లింపు వ్యవధి 6 నుండి 36 నెలల వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో బంగారు రుణాలపై ఏయే బ్యాంకులు ఎంత మేర వడ్డీ వసూలు చేస్తున్నాయో? ఓసారి తెలుసుకుందాం.
ఎస్‌బీఐ బ్యాంక్ గోల్డ్ లోన్‌లపై రీపేమెంట్ ఆధారంగా వడ్డీ రేట్లు విధిస్తూ ఉంటుంది. 12 నెలల బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్ లోన్‌పై 8.65 శాతం వడ్డీతో రుణాలను అందిస్తుంది. మూడు నెలల కాలం లోన్లపై 8.20 శాతం వడ్డీతో రుణాలను అందిస్తుంది. ఆరు నెలల బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్ లోన్‌పై 8.55 శాతం వడ్డీతో రుణాలను అందిస్తుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ బంగారంతో పాటు సావరిన్ గోల్డ్ బాండ్లపై 9.25 శాతం వడ్డీతో రుణాలను అందిస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా రిటైల్ లోన్‌ల కోసం వర్తించే బీఆర్ఎల్ఎల్ఆర్ 14.02.2023 నుంచి 9.15 శాతం వడ్డీతో రుణాలను అందిస్తుంది. ఇందులో ప్రస్తుత ఆర్‌బీఐ రెపో రేటు 6.50 శాతం ప్రకారం మార్కప్/బేస్ స్ప్రెడ్ 2.65 శాతం అధికంగా ఉంటుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 9.00 శాతం వడ్డీతో గోల్డ్ లోన్లను అందిస్తుంది. గోల్డ్ లోన్లను సమయానికి చెల్లించకపోతే గరిష్టంగా 17.65 శాతం వడ్డీను వసూలు చేస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ 9.00 శాతం వడ్డీతో గోల్డ్ లోన్లను అందిస్తుంది. గోల్డ్ లోన్లను సమయానికి చెల్లించకపోతే గరిష్టంగా 18 శాతం వడ్డీను వసూలు చేస్తుంది.
యాక్సిస్ బ్యాంక్ 7.70 శాతం నుంచి 9.30 శాతం వడ్డీతో బంగారు రుణాలను అందిస్తుంది. గోల్డ్ లోన్లను సమయానికి చెల్లించకపోతే గరిష్టంగా 17 శాతం వడ్డీను వసూలు చేస్తుంది.