AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: పసిడి ప్రియులకు పండక్కి ముందే చేదువార్త.. ఇక బంగారంలో అలా ఇన్వెస్ట్ చేయలేరు..

Gold Investment: బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..? పండుగ సీజన్ క్రమంలో చాలామంది డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటారు. అలాంటివారికి చేదువార్త. గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులను నిలిపివేశారు. ఈ మేరకు కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం.

Gold: పసిడి ప్రియులకు పండక్కి ముందే చేదువార్త.. ఇక బంగారంలో అలా ఇన్వెస్ట్ చేయలేరు..
Gold Investment
Venkatrao Lella
|

Updated on: Oct 16, 2026 | 12:39 PM

Share

దసరా, దీపావళి పండుగల క్రమంలో బంగారం ధరలు ఎలా ఉంటాయనే చర్చ అందరిలోనూ నెలకొంది. ధరలు ప్రస్తుతం తగ్గుతుండగా.. పండుగ సీజన్‌ కావడంతో ఎక్కువ కొనుగోళ్లు జరిగితే డిమాండ్ వల్ల ధరలు పెరుగుతాయని కొంతమంది ఆశిస్తున్నారు. దీపావళికి మరో 20 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో అప్పటికీ ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పండుగల సీజన్‌లో ధరలు ఎలా ఉంటాయనేది ఎవరూ చెప్పలేరు. డిమాండ్ వల్ల పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంతర్జాతీయంగా జరిగే పరిణామాల వల్ల తగ్గే అవకాశం కూడా ఉంటుందని కొంతమంది భావిస్తున్నారు. భౌతికంగా బంగారం కొనుగోలు చేయడమే కాకుండా డిజిటల్ రూపంలో గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇలాంటివారికి పండక్కి ముందే షాక్ తగిలింది.

నిలిపివేతకు కారణమేంటి..?

టాటా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ కంపెనీలు తమ గోల్డ్ ఈటీఎఫ్‌లలో కొత్త పెట్టుబడులను నిలిపివేశాయి. ఈ మేరకు తాజాగా నోటీసులు జారీ చేశాయి. అయితే ఎందుకు ఆంక్షలు విధించాయనే కారణాలను మాత్రం వెల్లడించలేదు. కొత్త పెట్టుబడులను నిలిపివేయగా.. ఇప్పటికే ఉన్న పెట్టుబడులను విక్రయించుకోవడానికి మాత్రం అనుమతి ఉంటుందని తెలిపాయి. తమ గోల్డ్ ఈటీఎఫ్‌ గోల్డ్ ఫండ్-ఆఫ్-ఫండ్స్ (FoF)లో కొత్త, అదనపు పెట్టుబడులతో పాటు స్విచ్ ఇన్, టాప్ అప్, కొత్త సిప్, సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్(STP) రిజిస్ట్రేషన్లు అక్టోబర్ 16 నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టాటా మ్యూచువల్ ఫండ్ ప్రకటన జారీ చేసింది. అయితే ఇప్పటికే చేరినవారు యథావిధిగా తమ పెట్టుబడులను కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది.

గోల్డ్‌కు పెరుగుతున్న డిమాండ్..

పండుగల సీజన్‌లో బంగారు ఆభరణాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. గోల్డ్ కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి తరుణంలో జనం ఎగబడటాన్ని నివారించేందుకు ఈ ఆంక్షలు ప్రవేశపెట్టి ఉండవచ్చని ఇండియన్ బులియన్ అండ్ జ్యూవెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేంద్ర మెహతా స్పష్టం చేశారు. సెంటిమెంట్ కారణంగా పండుగల సమయంలో ప్రజలు ఎక్కువగా గోల్డ్ కొనుగోలు చేస్తూ ఉంటారు. దీని వల్ల దీపావళి సమయంలో డిమాండ్ పెరుగతూ ఉంటుంది. స్టాక్ మార్కెట్ల నుంచి బలహీనమైన రాబడులు రావడం వల్ల పండుగుల సమయాల్లో గోల్డ్ ఈటీఎఫ్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో కంపెనీలు గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులను నిలిపివేయడం ఆసక్తికరంగా మారింది. రూపాయి విలువ పడిపోతున్న క్రమంలో విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీలను విక్రయిస్తున్నారు. బలమైన బంగారం డిమాండ్ రూపాయిపై ఒత్తిడిని మరింత పెంచుతోంది. దీంతో ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను  6 నుంచి 15  శాతానికి పెంచింది.

Follow Us