Gold Price Today: బ్యాడ్‌న్యూస్.. పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

|

Dec 21, 2023 | 6:09 AM

Gold And Sliver Price Today: దేశంలో బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ప్రతీ రోజూ బంగారం ధరలో ఎంతోకొంత పెరుగుదల కనిపిస్తోంది. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే, గోల్డ్‌ రేట్స్‌ భగ్గుమంటున్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం ఏకంగా రూ. 63 వేలకు చేరుకుంది. ఇక గడిచిన రెండు రోజులుగా బంగారం ధరలో హెచ్చు, తగ్గులు కనిపించాయి. అయితే, తాజాగా గురువారం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి పెరిగాయి.

Gold Price Today: బ్యాడ్‌న్యూస్.. పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
Gold Price Today
Follow us on

Gold And Sliver Price Today: దేశంలో బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ప్రతీ రోజూ బంగారం ధరలో ఎంతోకొంత పెరుగుదల కనిపిస్తోంది. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే, గోల్డ్‌ రేట్స్‌ భగ్గుమంటున్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం ఏకంగా రూ. 63 వేలకు చేరుకుంది. ఇక గడిచిన రెండు రోజులుగా బంగారం ధరలో హెచ్చు, తగ్గులు కనిపించాయి. అయితే, తాజాగా గురువారం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి పెరిగాయి. గురువారం ఉదయం 6 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం బంగారం ధరలో భారీగానే మార్పులు కనిపించాయి. మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,150 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయి విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,750 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 63,000 వద్ద కొనసాగుతోంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ. 58,350కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర అత్యధికంగా రూ. 63,650గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ. 57,750కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,000 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,750గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 63,000 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడతో పాటు సాగర నగరం విశాఖపట్నంలోనూ ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 57,750కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,000 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధర పెరగడంతో.. అదే బాటలో వెండి ధరలు కూడా పయణించాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధర పెరిగింది. కిలో వెండిపై గురువారం రూ. 1000 వరకు పెరిగింది. దీంతో ఢిల్లీతో పాటు ముంబయి, కోల్‌కతా, బెంగళూరు పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 78,500కి చేరుకుంది. ఇక చెన్నై, కేరళతో పాటు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,200 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..