
బంగారం భారతీయుల జీవితాల్లో ఓ భాగం. ఇది కేవలం ఒక మెటల్ కాదు ప్రత్యేక సెంటిమెంట్. పెళ్లి, పండగా ఇలా ఏ వేడుకైనా సరే బంగారం ఉండాల్సిందే. అయితే గత కొంత కాలంగా బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ సామాన్యులకు గట్టి షాక్ ఇస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు మరోసారి పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1910 పెరిగి రూ.159,280గా ఉంది. ఇది నిన్న రూ.1,57,370గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1750 పెరిగి ప్రస్తుతం 1,46,000గా ఉంది. ఈ ధర నిన్న
రూ.1,44,250గా ఉంది. అయితే సిల్వర్ ధరలు ఒక్కసారిగా రూ.20వేలు పెరిగి సామాన్యుడికి గట్టి షాకిచ్చాయి. నిన్న కిలో వెండి ధర రూ.2,70,000గా ఉండగా.. ఇవాళ రూ.2,90,000కు పెరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు హైదరాబాద్ కంటే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1910 పెరిగి రూ.1,59,430గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,57,520గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం రూ.1750 పెరిగి రూ.1,46,150గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,44,400గా ఉంది. అయితే వెండి ధరలు మాత్రం ఢిల్లీలో తక్కువగా ఉన్నాయి. కిలో వెండి రూ.5000 పెరిగి.. 2,75,000గా ఉంది. ఇక మన పక్క రాష్ట్రం చెన్నైలో బంగారం ధరలు భగభగమంటున్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2840 పెరిగి రూ.1,60,150గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.2600 పెరిగి రూ.1,46,800గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.20వేలు పెరిగి రూ.2,90,000గా ఉంది.
గ్లోబల్ మార్కెట్‌లో డాలర్ విలువలో మార్పులు, పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు మొగ్గు చూపడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ పెరగడం కూడా స్థానిక ధరలపై ప్రభావం చూపుతోంది.