Gold Rate Today: అలర్ట్.. తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..

Gold And Silver Price In Hyderabad - Vijayawada: పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా గత నెల లక్ష మార్కు దాటాయి.. ఆ తర్వాత కొంత మేర తగ్గుతూ వచ్చినప్పటికీ.. మళ్లీ పెరుగుతున్నాయి.. ఇటీవల 95వేల వరకు దిగొచ్చిన పసిడి ధరలు.. మళ్లీ నాలుగైదు రోజుల్లోనే 98వేల మార్క్‌కు చేరుకున్నాయి..

Gold Rate Today: అలర్ట్.. తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..
ఈ బంగారం ధరల మార్పుల వెనుక కీలక కారణంగా ప్రస్తుతం భారత్ - అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య వివాదం. అంటే సుంకాల యుద్ధం కనిపిస్తోంది. ఈ ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ మార్కెట్లపై, దేశీయ ఆర్థిక పరిస్థుతులపై ప్రభావం చూపుతుండటం వల్ల, బంగారం ధరలు కూడా పెరుగుతూనే, ఇప్పుడు కొంతమేర తగ్గింది.

Updated on: May 27, 2025 | 7:05 AM

Gold And Silver Price In Hyderabad – Vijayawada: పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా గత నెల లక్ష మార్కు దాటాయి.. ఆ తర్వాత కొంత మేర తగ్గుతూ వచ్చినప్పటికీ.. మళ్లీ పెరుగుతున్నాయి.. ఇటీవల 95వేల వరకు దిగొచ్చిన పసిడి ధరలు.. మళ్లీ నాలుగైదు రోజుల్లోనే 98వేల మార్క్‌కు చేరుకున్నాయి.. ఈ క్రమంలోనే.. తాజాగా బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర పెరిగింది.. మే 27 2025 మంగళవారం ఉదయం వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల బంగారం ధర 97,630 ఉండగా.. 22 క్యారెట్ల ధర 89,490 లుగా ఉంది.. పది గ్రాముల బంగారంపై రూ.10 మేర ధర పెరిగింది. వెండి కిలో ధర రూ.100 పెరిగి.. రూ.1,00,100 లుగా ఉంది.

బంగారం, వెండి ధరలు..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,630గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.89,490లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.1,11,100లుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,630గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ. 89,490లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,11,100 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,780గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.89,640లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,00,100లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.97,630, 22 క్యారెట్ల ధర రూ.89,490 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,00,100లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.97,630, 22 క్యారెట్ల ధర రూ.89,490 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,11,100లుగా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.97,630, 22 క్యారెట్ల ధర రూ.89,490 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,00,100లుగా ఉంది.

కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..