Gold Rates Today: బంగారం ధర ఇంకా పడిపోతుందా..? తెలుగు రాష్ట్రాల్లో పసిడి 10 గ్రాములు ఎంతుందంటే..

ఇటీవల కాలంలో బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెరిగాయి.. ఏకంగా లక్షా 30 వేల మార్క్ దాటి పరుగులు పెట్టాయి.. ఆ తర్వాత దాదాపు బంగారం ధరలు 10 వేల వరకు తగ్గాయి.. అయితే.. తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

Gold Rates Today: బంగారం ధర ఇంకా పడిపోతుందా..? తెలుగు రాష్ట్రాల్లో పసిడి 10 గ్రాములు ఎంతుందంటే..
Gold Price

Updated on: Nov 17, 2025 | 6:49 AM

బంగారం, వెండి ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ షాకిస్తున్నాయి. ఇటీవల కాలంలో బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెరిగాయి.. ఏకంగా లక్షా 30 వేల మార్క్ దాటి పరుగులు పెట్టాయి.. ఆ తర్వాత దాదాపు బంగారం ధరలు 10 వేల వరకు తగ్గాయి.. అయితే.. తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే.. గత మూడు రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. అయితే.. ప్రపంచవ్యాప్తంగాచోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బంగారం వెండి ధరలు తగ్గే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.. వాస్తవానికి బంగారం, వెండి ధరల్లో నిత్యం హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటాయి.. ఒక్కో రోజు బంగారం, వెండి ధర తగ్గితే.. మరికొన్ని రోజులు పెరుగుతాయి.. తాజాగా.. సోమవారం ఉదయం ఆరు గంటల వరకు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి..

పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. సోమవారం (నవంబర్ 17 2025) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.10 ధర తగ్గి రూ.1,25,070 గా ఉంది.

22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.10 తగ్గి రూ.1,14,640 గా ఉంది.

వెండి కిలోపై రూ100 మేర ధర తగ్గి రూ.1,68,900 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,070 ఉండగా.. 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.1,14,640 ఉంది.. కిలో వెండి ధర రూ.1,74,900 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,25,070, 22 క్యారెట్ల ధర రూ.1,14,640 గా ఉంది.. కిలో వెండి ధర రూ.1,74,900 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,25,220, 22 క్యారెట్లు రూ.1,14,790 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,68,900 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1,25,070, 22 క్యారెట్లు రూ.1,14,640 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,68,900 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,25,990, 22 క్యారెట్ల ధర రూ.1,15,490 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,74,900 ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,25,070, 22 క్యారెట్ల ధర రూ.1,14,640 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,68,900 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..