Gold Price: పసిడి ధరలు భగభగ.. రూ.77 వేలు దాటిన బంగారం ధర.. హైదరాబాద్‌లో లక్ష దాటిన వెండి!

|

Sep 25, 2024 | 8:41 PM

దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. నవరాత్రులకు ముందు పసిడి ధరలు భగభగమంటున్నాయి. తులం బంగారంపై భారీగా పెరిగింది. సెప్టెంబర్‌ 25న ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకే వెయ్యి రూపాయల వరకు ఎగబాకింది. పండగ సమయంలో ఇలా ధరలు పెరుగుతుండటం మహిళలకు షాకిచ్చినట్లవుతోంది. ఇండియా బులియన్..

Gold Price: పసిడి ధరలు భగభగ.. రూ.77 వేలు దాటిన బంగారం ధర.. హైదరాబాద్‌లో లక్ష దాటిన వెండి!
Gold
Follow us on

దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. నవరాత్రులకు ముందు పసిడి ధరలు భగభగమంటున్నాయి. తులం బంగారంపై భారీగా పెరిగింది. సెప్టెంబర్‌ 25న ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకే వెయ్యి రూపాయల వరకు ఎగబాకింది. పండగ సమయంలో ఇలా ధరలు పెరుగుతుండటం మహిళలకు షాకిచ్చినట్లవుతోంది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ప్రకారం.. సెప్టెంబర్‌ 25వ తేదీన రాత్రి 8 గంటల సమయానికి తులం బంగారం ధర భారీగా పెరిగింది. ఏకంగా రూ.660 వరకు ఏకబాకింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,750 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,170 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.70,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,020 వద్ద ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,600 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.77,020 వద్ద కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సమయానికి బంగారం ధర పెరుగుతుంటే.. వెండి మాత్రం అతి స్వల్పంగా తగ్గింది. కేవలం వంద రూపాయలు మాత్రమే తగ్గుతూ ప్రస్తుతం కిలో వెండి ధర రూ.92,800 వద్ద కొనసాగుతోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం లక్ష రూపాయలు దాటేసింది. చెన్నై, హైదరాబాద్‌, కేరళలో రూ.1,01,000 వద్ద నమోదైంది. ఇక ఢిల్లీ, కోల్‌కతాలో రూ.95000 వద్ద ఉంది.

అయితే పైన పేర్కొన్న బంగారం ధరలు జీఎస్టీ, టీసీఎస్‌ వంటివి కలిపిన ధరలు ఉండవు. వాటికి వేరే ఛార్జీలు వేస్తారు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని సంప్రదించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: PM Kisan: దసరా పండగకు ముందు రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 18వ విడత తేదీ ఖరారు.. ఎప్పుడంటే..

24 క్యారెట్ల బంగారం

24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. స్వచ్ఛమైన బంగారం లేదా 24 క్యారెట్ బంగారం 99.9 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది. అలాగే దానిలో ఏ ఇతర లోహాన్ని కలపరు. 24 క్యారెట్ల బంగారాన్ని బంగారు నాణేలు, కడ్డీల తయారీకి ఉపయోగిస్తారు. బంగారం కోసం ఇతర విభిన్న స్వచ్ఛతలు ఉన్నాయి. వీటిని 24 క్యారెట్‌లతో పోల్చి కొలుస్తారు.

22 క్యారెట్ల బంగారం

ఆభరణాల తయారీకి 22 క్యారెట్ల బంగారం మంచిది. ఇది 22 భాగాలు బంగారం, రెండు భాగాలు వెండి, నికెల్ లేదా ఏదైనా ఇతర లోహం. ఇతర లోహాలను కలపడం ద్వారా బంగారం గట్టిపడుతుంది. అలాగే ఆభరణాలకు అనుకూలంగా ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం 91.67 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది.

ఇది కూడా చదవండి: Mobile: పొరపాటున మొబైల్‌లో ఈ పని చేయకండి.. యమ డేంజర్.. జైలు శిక్ష తప్పదు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి