
బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులకు లోవుతుంటుంది. ఒక రోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు అంతకు రెండు, మూడింతలు పెరుగుతుంది. గతంలో 90 వేల రూపాయల వరకు ఉన్న బంగారం ధరలు.. ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయలు దాటేసింది. తగ్గినట్లే తగ్గి భారీగా ఎగబాకుతోంది. తాజాగా ఆగస్టు 6వ తేదీన తులం బంగారం ధర భారీగా పెరిగింది. మంగళవారంతో పోల్చుకుంటే తులం బంగారంపై 900 రూపాయల వరకు పెరిగింది. గత రెండు రోజుల కిందటి ధరను చూస్తే తులంపై ఏకంగా 1500 రూపాయల వరకు పెరిగింది. ఇలా రెండు, మూడు రోజుల దరలను పరిశీలిస్తే తులంపై దాదాపు 3 వేల రూపాయలకుపైగానే పెరిగింది.
ఇది కూడా చదవండి: AP School Holidays: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాఠశాలలకు భారీగా సెలవులు.. విద్యార్థులకు పండగే..!
ఇలా రోజురోజుకు పెరుగుతూపోతే సామాన్యులకు భారంగా మారనుంది. తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02230 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,710 ఉంది. అదే 18 గ్రాముల ధర 76,680 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.
ఇక ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే..
ఇది కూడా చదవండి: Bank Holidays: వినియోగదారులకు అలర్ట్.. మూడు రోజులు బ్యాంకులు బంద్!
అయితే బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయిని తాకిన నేపథ్యంలో బంగారు ఆభరణాల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం పెరిగిన ధరలను చూస్తే.. 10 గ్రాముల గోల్డ్ చైన్ కొనుగోలు చేయాలంటే కనీసం లక్ష రూపాయల పైన ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉంటాయి అన్న దానిపైన అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే ఈ ధరల్లో జీఎస్టీ, ఇతర ఛార్జీలు ఉండవు. వాటిని కలిపితే మరింత పెరగనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి