Gold and Silver Price Today: మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. ఈ రోజు ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

|

Dec 26, 2024 | 7:01 AM

ఏడాదిలో చివరి వారానికి వచ్చేశాం.. మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాదిలో అడుగు పెట్టనున్నాం. దీంతో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూ అస్థిరంగా కొనసాగుతున్నాయి. ట్రంప్ అమెరిక అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత అంతర్జాతీయంగా పసిడి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా కూడా పడుతోంది. అయితే బంగారం నగలకు డిమాండ్ నెలకొంది. దీంతో తగ్గినట్లే తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్ళీ ఈ రోజు స్వల్పంగా పెరిగాయి.

Gold and Silver Price Today: మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. ఈ రోజు ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
Gold Silver Price Today
Follow us on

ముదుపరులు బంగారం, వెండిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. మరోవైపు మహిళలకు పసిడి కొనుగోలుకి ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో గత కొంతకాలంగా పసిడి, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. యుఎస్ డాలర్ విలువ బలపడితే దేశీయంగా పసిడి ధర నేలకి దిగి వస్తుంది. 014 చివరి త్రైమాసికంలో బంగారం ధరలు తగ్గడంతో ఒక్కసారిగా భారీ డిమాండ్ ఏర్పడింది. మరోవైపు కొత్త సంవత్సరం రానున్న నేపధ్యంలో పసిడి ధరలపై ప్రభావం చూపిస్తోంది. బంగారానికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపధ్యంలో దేశంలో బంగారం ధర ఈ రోజు (గురువారం డిసెంబర్ 26వ తేదీన) స్వల్పంగా పెరిగింది. ఈ నేపధ్యంలో హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల తో పాటు దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరపై ప్రభావం పడింది. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పాటకులకు అందిస్తున్నాం..

గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు స్ధిరంగా ఉండటం లేదు.
హైదరాబాద్ ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) పది రూపాయలు పెరిగి.. రూ. 71,010 లుగా కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాము) రూ. 10 లు పెరిగి రూ.77,460లు గా ఉంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నం, పొద్దుటూరు, వరంగల్ లో కొనసాగుతున్నాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో నేటి పసిడి ధరలు

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.71,160లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాము) రూ77,610గా కొనసాగుతోంది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.71,010లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాము) రూ77,460గా కొనసాగుతోంది.

ముంబై లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.71,010లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాము) రూ77,460గా కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.71,010లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాము) రూ77,460గా కొనసాగుతోంది.

వెండి ధరలు:

బంగారంలో బాటలో పయనిస్తున్న వెండి ధరల్లో కూడా స్థిరత్వం ఉండడం లేదు. ఒకానొక సమయంలో దీంతో కిలో వెండి లక్ష దాటింది. అయితే అంతర్జాతీయ మార్కెట్ లో వస్తున్న మార్పులతో దేశీయంగా వెండి ధరల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ కిలో వెండి 90 వేలకు దిగి రావడం లేదు. ఈ నేపధ్యంలో నేడు కిలో వెండి ధర రూ. 100 లు పెరిగి 99,100 లకు చేరుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ కిక్ చేయండి..