
ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఒకప్పుడు తులం బంగారం కొందామనుకున్న వారు కూడా ఇప్పుడు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మన పొరుగు దేశమైన నేపాల్‌తో పోలిస్తే మన దగ్గరే ధరలు ఎక్కువున్నాయని అనుకుంటారు. ఈ క్రమంలో చాలామంది నేపాల్ వెళ్తే బంగారం తక్కువ ధరకే దొరుకుతుందని అనుకుంటారు. కానీ తాజా లెక్కలు చూస్తే అది నిజం కాదని అర్థమవుతుంది. నేపాల్ కరెన్సీ విలువ మనకంటే తక్కువగా ఉన్నప్పటికీ, అక్కడ వస్తువుల ధరలు మాత్రం ఎక్కువే.
నేపాల్ అధికారిక సంస్థ పాట్రో ప్రకారం.. నేపాల్‌లో 1 గ్రాము బంగారం ధర 26,492 నేపాల్ రూపాయలు. ఈ ధర భారత కరెన్సీలో 16,714.54 రూపాయలు. నేపాల్‌లో 10 గ్రాముల బంగారం ధర 2,64,920 నేపాల్ రూపాయలు. ఈ ధర భారత కరెన్సీలో 1,67,145.38 రూపాయలు. ఈ సమయంలో భారతదేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,960 రూపాయలు. అంటే నేపాల్‌లో బంగారం ధర భారతదేశంలో కంటే ఎక్కువగా ఉంటుంది.
నేపాల్‌లో 10 గ్రాముల వెండి ధర 5,800 నేపాల్ రూపాయలు. ఒక కిలో వెండి ధర 5,80,000 నేపాల్ రూపాయలు. భారత రూపాయితో పోలిస్తే నేపాల్ కరెన్సీ బలహీనంగా ఉంది. ఈ సమయంలో 1 రూపాయి 1.58 నేపాల్ రూపాయలకు సమానం. ఒక కిలో వెండి ధర 5,80,000 నేపాల్ రూపాయలు. భారత రూపాయిలో.. ఈ ధర 3.65 లక్షల రూపాయలు. ఈ సమయంలో మన దేశంలో1 కిలో వెండి ధర రూ.3,75,100గా రూపాయలు. భారతదేశంతో పోలిస్తే నేపాల్‌లో వెండి కొద్దిగా తక్కువ ఉంది.
ప్రపంచ మార్కెట్‌లో ఈ అస్థిరతకు మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి:
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కొనసాగుతున్న అశాంతి ఇన్వెస్టర్లను బంగారం వైపు మళ్లీస్తోంది.
ట్రంప్ విధానాల ఎఫెక్ట్: అమెరికాలో ట్రంప్ పరిపాలన తీసుకుంటున్న కొన్ని కఠిన నిర్ణయాలు, ముఖ్యంగా బ్రిక్స్ దేశాలపై చూపిస్తున్న ప్రభావం వల్ల కరెన్సీ మార్కెట్లు ప్రభావితమవుతున్నాయి.
ఆర్థిక అస్థిరత: ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారంపై అందరూ మొగ్గు చూపుతున్నారు.
నేపాల్ వంటి చిన్న ఆర్థిక వ్యవస్థలపై ఈ ధరల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన జరిగి, రాజకీయ సమీకరణాలు మారితే తప్ప ఈ ధరలు ఇప్పుడప్పుడే అదుపులోకి వచ్చేలా లేవని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరికొన్ని రోజులు ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి