Gold & Silver Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం.. భారీగా పతనమైన వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..

|

Jul 07, 2022 | 7:17 AM

Gold & Silver Price Today: బంగారం కొనాలనుకునేవారికి ఊరట లభించింది. నిన్న పెరిగిన పసిడి ధరలు నేడు మళ్లీ తగ్గాయి. బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 500..

Gold & Silver Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం.. భారీగా పతనమైన వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..
Gold And Silver Price Today
Follow us on

Gold & Silver Price Today: బంగారం కొనాలనుకునేవారికి ఊరట లభించింది. నిన్న పెరిగిన పసిడి ధరలు నేడు మళ్లీ తగ్గాయి. బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 500, అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.540 మేర తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,100 నుంచి రూ.47,600 కి తగ్గింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52, 470 నుంచి రూ.51, 930 కి తగ్గింది. ఇక వెండి ధరలు కూడా బాగా పతనమయ్యాయి. కేజీ వెండిపై రూ. 2000 తగ్గడం గమనార్హం. రూ.56, 900కు చేరుకుంది. మరి మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం రండి.

☛హైదరాబాద్‌: 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.47,600గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.51, 930 పలుకుతోంది

☛ విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

☛ విశాఖపట్నం : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,600 పలుకుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 వద్ద ఉంది.

☛ చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51, 710 పలుకుతోంది.

☛ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51, 930 వద్ద కొనసాగుతోంది.

☛ ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,600గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51, 930పలుకుతోంది.

☛ కోల్‌కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 వద్ద ఉంది.

☛ బెంగళూరు : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48, 130గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,500 పలుకుతోంది.

☛ కేరళ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,630గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 వద్ద ఉంది.

భారీగా పడిపోయిన వెండి ధరలు..

గురువారం వెండి ధరలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.62,500గా ఉంది. ఇక విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో మాత్రం రూ.56, 900 పలుకుతోంది.

గమనిక:
బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజూ మార్పులు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, జ్యువెలరీ మార్కెట్లలో నగలకు డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి బంగారం, వెండిని కొనుగోలు చేయలనుకునేవారు ఈ అంశాలన్నింటినీ పరిశీలించుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..