Gold & Silver Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. వెండి కూడా పసిడి బాటలోనే.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..

Gold & Silver Price Today: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.100, అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.130 మేర పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర

Gold & Silver Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. వెండి కూడా పసిడి బాటలోనే.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..
Gold Price Today

Updated on: Jul 06, 2022 | 7:45 AM

Gold & Silver Price Today: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.100, అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.130 మేర పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,000 నుంచి రూ.48,100కి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,340 నుంచి రూ.52,470కి పెరిగింది. ఇక వెండికూడా బంగారం బాటలోనే పయనించింది. కేజీ వెండిపై రూ. 700 పెరిగి రూ.64,700కు చేరుకుంది. మరి మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం రండి.

☛హైదరాబాద్‌: 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.48,100గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.52,470 పలుకుతోంది

☛ విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,100 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..52,470 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

☛ విశాఖపట్నం : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,100 పలుకుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470 వద్ద ఉంది.

☛ చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,050గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52, 420 పలుకుతోంది.

☛ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,100గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470 వద్ద కొనసాగుతోంది.

☛ ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,100గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470పలుకుతోంది.

☛ కోల్‌కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440 వద్ద ఉంది.

☛ బెంగళూరు : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48, 130గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,500 పలుకుతోంది.

☛ కేరళ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,100గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470 వద్ద ఉంది.

గోల్డ్‌ బాటలోనే సిల్వర్‌..

బుధవారం వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.64,700గా ఉంది. ఇక విజయవాడ, విశాఖ, చెన్నై నగరాల్లోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ముంబైలో రూ.58,900, ఢిల్లీలో రూ58,900, కోల్‌కతాలో రూ.58,900 బెంగళూరులో రూ.64,700, కేరళలో రూ.64,700 పలుకుతోంది.

గమనిక:
బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజూ మార్పులు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, జ్యువెలరీ మార్కెట్లలో నగలకు డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి బంగారం, వెండిని కొనుగోలు చేయలనుకునేవారు ఈ అంశాలన్నింటినీ పరిశీలించుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us