గత కొన్ని వారాలుగా బంగారం , వెండి ధరలు చాలా హెచ్చు తగ్గులను చవిచూస్తున్నాయి. అయినప్పటికీ బంగారం, వెండి లోహాల ధరలు ఆల్ టైం హై గానే కొనసాగుతున్నాయి. ఆదివారం కొంతమేర తగ్గిన పసిడి, వెండి ధరలు నేడు కొంతమేర పెరిగాయి. ఈరోజు(జూన్ 3వ తేదీ) బంగారం ధర గ్రాముకు ఒక రూపాయి తగ్గింది. మరోవైపు వెండి కూడా పసిడి బాటలోనే పయనిస్తూ గ్రాము వెండి ధర 10 పైసలు మేర తగ్గింది. దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో కూడా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. ఈ హెచ్చుతగ్గులు ఈ వారం కూడా కొనసాగే అవకాశం ఉందని మార్కెటింగ్ రంగ నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలతో సహా దేశంలోని ప్రముఖ నగరాల్లో పసిడి వెండి ధరలు ఈ రోజు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
భారతదేశంలో ఈ రోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 6,649లు ఉండగా 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7,254లు గా కొనసాగుతుంది.
ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర ఒక్క రూపాయి తగ్గి పది గ్రాముల బంగారం రూ. 6,649లుగా కొనసాగుతుంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం ధర
గ్రాము ఒక రూపాయి మేర తగ్గి రూ. 7,254లకు చేరుకోగా పది గ్రాముల పసిడి ధర రూ. 72,540 లకు చేరుకుంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన విశాఖ పట్నం, విజయవాడ, వరంగల్ లో కూడా కొనసాగుతున్నాయి.
భారతదేశంలో వెండి ధర అంతర్జాతీయ మార్కట్ లో ధరల ద్వారా నిర్ణయించబడుతుంది. వెండి ధరలు కూడా డాలర్‌తో రూపాయి మారకం కరెన్సీ కదలికపై ఆధారపడి ఉంటుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోయినా, అంతర్జాతీయ ధరలు స్థిరంగా ఉన్నా వెండి ఖరీదైన లోహంగా మారుతోంది. నిన్నా మొన్నటి వరకూ కిలో వెండి ధర లక్షకు పైగా చేరుకుని ఆల్ టైం రికార్డ్ ని క్రియేట్ చేయగా ఇప్పుడు క్రమంగా వెండి ధర దిగివస్తోంది. ఈ రోజు కిలో వెండి ధర రూ. 100లు తగ్గి కిలో రూ. 93,400లు గా కొనసాగుతోంది. ఇవే ధరలు దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి.
అమెరికాలో బ్యాంకు వడ్డీ రేటు పెరగవచ్చన్న భయం ఈ బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు ఏర్పడడానికి ప్రధాన కారణమైంది. నిపుణుల అంచనాల ప్రకారం బంగారం ధర ఇప్పుడు తగ్గుతోంది, అయితే రాబోయే రోజుల్లో ఇది మళ్లీ పెరుగుతుంది. ఈ ఏడాది (2024 చివరి నాటికి) బంగారం ధర రూ.70,000 మార్కును దాటవచ్చని చెబుతున్నారు.
( గమనిక: ఇక్కడ ఇవ్వబడిన బంగారం , వెండి ధరల విషయంలో ఖచ్చితమైనవని హామీ ఇవ్వలేము. ఇది ప్రముఖ మార్కెట్ రంగ నిపుణుల అబిప్రాయం, నగల దుకాణాల నుండి సేకరించిన సమాచారం. అలాగే, ఈ ధరలు GST, మేకింగ్ ఛార్జీలు మొదలైన వాటికి లోబడి ధరల్లో మార్పులు ఉండవచ్చు.)
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..