అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష పదవి రిజల్ట్ వచ్చి ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడిగా ఎంపిక అయిన తర్వాత డాలర్ బలపడుతోంది. దీంతో అంతర్జాతీయ స్థాయితో పాటు దేశీయంగా బంగారం, వెండి ధరల్లో భారీ పతనం కనిపిస్తోంది. అవును డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత డాలర్ రోజు రోజుకీ బలపడుతోంది. మరోవైపు ట్రంప్ తాను యుఎస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని దేశాలపై సుంకాలను పెంచనున్నట్లు ప్రకటించారు.
Gold
Follow us on
అంతర్జాతీయ స్థాయిలో న్యూయార్క్ లో మార్కెట్ ప్రభావం భారత మార్కెట్లపై పడుతుంది. డాలర్ బలపడుతోండడంతో మన దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. ఇండియాస్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే బంగారం ధర రూ.900 తగ్గగా.. వెండి ధర రూ.1200 తగ్గింది.
మార్కెటింగ్ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం డాలర్ ఇండెక్స్ బలం కారణంగా.. పసిడి వెండి ధరలలో భారీ పతనం చోటు చేసుకుంది. వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత డాలర్ మరింత బలపడుతోంది. మరోవైపు ప్రమాణ స్వీకారం తర్వాత కొన్ని దేశాలపై సుంకాలను పెంచనున్నామని ఇప్పటికే ట్రంప్ స్పష్టం చేశారు. ఈ రోజు ధరల్లో పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Gold And Silver
బంగారం బాటలో వెండి ధర: మరోవైపు వెండి ధరలు కూడా పసిడి బాటలోనే పయనిస్తున్నట్లు తెలుస్తోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో వెండి ధర 10 నిమిషాల వ్యవధిలో కిలోకు రూ.1175 తగ్గి రూ.90,034 స్థాయికి చేరుకుంది. డేటాను పరిశీలిస్తే.. శుక్రవారం మార్కెట్ ముగిసే సరికి వెండి ధర రూ.91,209గా ఉంది. కాగా నేడు రూ.90,555 వద్ద ముగిసింది. ఉదయం 9.20 గంటలకు వెండి ధర రూ.974 తగ్గి రూ.90,235కి చేరుకుంది.
విదేశీ మార్కెట్ల పరిస్థితి ఎలా ఉందంటే..: విదేశీ మార్కెట్లోనూ బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. డేటా ప్రకారం Comexలో బంగారం ఫ్యూచర్ ఔన్సుకు $ 33 పతనంతో $ 2,648.50 వద్ద ట్రేడవుతోంది. గోల్డ్ స్పాట్ ధర ఔన్స్‌కు 16 డాలర్లు తగ్గి ఔన్స్‌కు 2,627.07 డాలర్లుగా ఉంది. యూరోపియన్ మార్కెట్లో బంగారం ధర 3 యూరోలు స్వల్పంగా పెరిగి ఔన్సు ధర 2,496.26 యూరోలుగా ఉంది.
మరోవైపు, Comexలో వెండి ధర 1.42 శాతం తగ్గి $ 30.67 వద్ద ఉంది. వెండి ఔన్సు ధర 1.28 శాతం క్షీణించి $ 30.23 వద్ద ట్రేడవుతోంది.