Gold Silver Price: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold rates) ఆకాశమే హద్దుగా పెరిగిన విషయం తెలిసిందే. ప్రపంచ మార్కెట్లో నెలకొన్న వాతావరణం, రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రికత్త పరిస్థితుల నేపథ్యంలో గోల్డ్ ధరలు పెరిగాయి. అయితే ఆ తర్వాత పరిస్థితులు మెరుగుపడుతోన్న నేపథ్యంలో క్రమంగా ధరలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన మూడు రోజులుగా గోల్డ్, సిల్వర్ ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా బుధవారం మరోసారి బంగారం ధరలు తగ్గాయి. నేడు దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేయండి..
* దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,860 గా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,860 వద్ద కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో 24 క్యారెట్ల తులం గోల్డ్ రేట్ రూ. 53,250 గా నమోదైంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,860 గా ఉంది.
* హైదరాబాద్‌లో బుధవారం తులం బంగారం ధర రూ. 52,860 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,860 గా ఉంది.
* విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,860 గా నమోదైంది.
* న్యూఢిల్లీలో బుధవారం కిలో వెండిపై రూ. 250 తగ్గి రూ. 65,450 వద్ద కొనసాగుతోంది.
* ముంబైలోనూ రూ. 250 తగ్గి, కిలో వెండి ధర రూ. 65,450 వద్ద కొనసాగుతోంది.
* హైదరాబాద్‌లో వెండి ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇక్కడ బుధవారం కిలో వెండి రూ. 70,500 గా నమోదైంది.
* విజయవాడలో కిలో వెండి ధర రూ. 70,500 గా ఉంది.
* సాగర నగరం విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 70,500 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన తమన్.. స్కోర్ స్టార్ట్ అంటూ పోస్ట్..
GT vs SRH: ఒకే ఒక ఓటమికి గుజరాత్ ప్రతీకారం తీర్చుకుంటుందా.. హైదరాబాద్ వరుస విజయాలను కొనసాగిస్తుందా..