Gold And Silver Price: మనదేశంలో బంగారం ఆభరణమే కాదు.. అవసరానికి ఉపయోగపడే ఆర్ధిక వనరు కూడా.. ఇక కరోనా సమయంలో ఆల్ టైం గరిష్ఠానికి చేరుకున్న పసిడి.. గత కొన్ని రోజులుగా మెల్లగా దిగి వచ్చింది. అయితే గోల్డ్ ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో సామాన్యులనుంచి ఆర్ధిక నిపుణుల వరకూ అంచనా వేయలేకుండా ఉన్నారు. అయితే గత రెండు రోజులుగా స్వల్పంగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వచ్చాయి. అయితే ఇవాళ మాత్రం బంగారం ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంతకాలం తగ్గుముఖం పట్టిన పుత్తడి ధరలు.. ఇవాళ రూ. 100 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో ఇవాళ పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 44,920 వద్ద ట్రేడ్ అవుతుండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేట్స్ రూ. 43,920 పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,160 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 44,150 పలుకుతోంది. ఆర్థిక రాజధాని ముంబైలోనూ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ముంబైలో 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ కాస్ట్ వచ్చేసి రూ. 44,920 ఉండగా, 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 43,920 గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,200 పలుకుతుండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 42,350 వద్ద ట్రేడ్ అవుతోంది. కోల్‌కత్తాలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 47,040 ఉండగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 44,340 గా ఉంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో శుక్రవారం పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్థానిక మార్కెట్‌లో తులం బంగారంపై రూ. 100 చొప్పున పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం నాడు 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 45,820 ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 42,000 లకు చేరింది. ఇక విజయవాడలోనూ పసిడి ధరలది అదే పరిస్థితి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర 42,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 45,820 గా ఉంది. విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,820 వద్ద ట్రేడ్ అవుతుండగా.. 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 42,000 గా ఉంది.
బంగారం ధరలు ఇలాఉంటే.. వెండి ధరలు కూడా పసిడిని ఫాలో అయ్యాయి. కేజీ వెండికి రూ. 400 మేర పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 69,400 పలుకుతోంది. విజయవాడలో కిలో వెండి 69,400 ఉండగా, విశాఖపట్నంలో 69,400 సేమ్ ఉన్నాయి.
Also read: