
దేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. తగ్గేదేలే అంటూ పరుగులు పెడుతోంది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. స్టాకిస్టులు కొనుగోళ్లు చేయడంతో బుధవారం వెండి కిలోకు రికార్డు స్థాయిలో పెరిగి కిలో వెండి ధర.1,18,000కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,040 పెరిగి రూ.1 లక్షా2,330లకు చేరుకుంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.950 పెరిగి రూ.93,800కు చేరుకుంది. ప్రపంచ అనిశ్చితి, పారిశ్రామిక డిమాండ్ పెరుగుదల కారణంగా బంగారం, వెండి ధరల్లో ఈ పెరుగుదల జరిగింది.
ఇది కూడా చదవండి: Honda: స్టైలిష్ లుక్‌తో హోండా నుంచి రెండు పవర్‌ఫుల్ బైక్‌లు.. ఫీచర్స్ అదుర్స్!
ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాములకు రూ.1,040 పెరిగి రూ.1,02330కి చేరుకుంది (అన్ని పన్నులతో సహా). గత ట్రేడింగ్ సెషన్‌లో ఇది 10 గ్రాములకు రూ.1,01,020 వద్ద ముగిసింది. అంటే బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే రానున్న రోజుల్లో తులం బంగారం ధర లక్షా 10 వేలు దాటవచ్చని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Ratan Tata: రతన్ టాటా ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? దీని విలువ ఎన్ని కోట్లు?
భారతదేశంలో బంగారం, వెండి ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్లపై ఆధారపడి ఉంటాయి. దీనితో పాటు, రూపాయి-డాలర్ మారకం రేటు కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడి, ప్రపంచ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, భారతీయ కొనుగోలుదారులకు ధరలు ఖరీదైనవి అవుతాయి. దీనితో పాటు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ ధోరణులు కూడా ధరలను ప్రభావితం చేస్తాయి. సాధారణంగా బంగారం, వెండి ధరలు ఒకే దిశలో కదులుతాయి. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పుడు, వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు, ఈ విలువైన లోహాలకు డిమాండ్ పెరుగుతుంది. ఇది ధరలను కూడా పెంచుతుంది.
ఇది కూడా చదవండి: New Expressway: ఇప్పుడు 6 గంటల ప్రయాణం కేవలం 2 గంటల్లోనే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి