Gold And Silver Price Today:పసిడి ప్రియులకు శుభవార్త. గత కొద్ది రోజులుగా పరుగులు పెట్టిన బంగారం ధరలు నిన్నటి వరకు స్థిరంగా కొనసాగాయి. మంగళవారం ఉదయం దేశీయ మార్కెట్లో పసిడి ధరలలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.47,600 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు బంగారం ధర రూ. 200లు తగ్గింది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.220 తగ్గడంతో రూ.51,930 పలుకుతోంది. ఇవాళ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.400 తగ్గడంతో రూ. 55,200 గా ఉంది. ఇక మంగళవారం (ఆగస్ట్ 23) తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం..
☛హైదరాబాద్: 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.47,600గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.51,930 పలుకుతోంది.
☛ విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 వద్ద కొనసాగుతోంది.
☛ విశాఖపట్నం : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,600గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..51,930 వద్ద ఉంది.
☛ బెంగళూరు : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 పలుకుతోంది.
☛ చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,150గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,530 పలుకుతోంది.
☛ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 వద్ద కొనసాగుతోంది.
☛ ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల రూ.52,100 పలుకుతోంది.
☛ కోల్‌కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.51,930కు లభిస్తోంది.
☛ కేరళ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 వద్ద ఉంది.
తగ్గిన వెండి ధరలు..
సిల్వర్ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్ తగిలింది. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఈరోజు ఉదయం బులియన్ మార్కెట్లో కిలో రూ.400 పెరగడంతో హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.61,100గా ఉంది. విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లోనూ ఇదే ధరకు వెండి లభిస్తోంది. ఇక ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో రూ. 55,200 పలుకుతోంది.