Gold Price Today: బంగారం కొనుగోలు దారులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాలివే

ప్రస్తుతం దేశంలోని బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,320 గా ఉంది. ఇక వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.

Gold Price Today: బంగారం కొనుగోలు దారులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాలివే
Gold Price Today

Updated on: Mar 20, 2023 | 6:15 AM

బంగారం కొనుగోలు దారులకు ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వస్తోన్న ధరలు సోమవారం (మార్చి 20) మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ప్రస్తుతం దేశంలోని బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,320 గా ఉంది. ఇక వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.72,100 పలుకుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం ముఖ్యం.

తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,320 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,320 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

* విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,320 ఉంది.

* దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 55,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,470 వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,600 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,650 పలుకుతోంది.

* ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.55,300 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.60,320 వద్ద ఉంది.

* బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.55,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60, 370 వద్ద కొనసాగుతోంది.

వెండి ధర ఎలా ఉందంటే..

సోమవారం చెన్నైలో కిలో వెండి ధర రూ.74,400 గా ఉండగా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో రూ.72,100 పలుకుతోంది. ఇక హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ నగరాల్లో రూ.74,400 లకు లభిస్తోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం.. క్లిక్ చేయండి