
గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. దీపావళికి ముందు బంగారం ధర గణనీయంగా పెరిగింది. కానీ తరువాత అది క్రమంగా తగ్గింది. ఇప్పుడు మరోసారి బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగి ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. 2025లో బంగారం ధర దాదాపు 73-75 శాతం పెరిగింది. 2025 జనవరి 1న 10 గ్రాముల బంగారం ధర రూ.78,000గా ఉంది. ఇప్పుడు డిసెంబర్ నెలలో అదే 10 గ్రాములకు రూ.1,37,000కి చేరుకుంది. గత 46 సంవత్సరాలలో బంగారం ధర ఇంతగా పెరగడం ఇదే మొదటిసారి. అందుకే పెట్టుబడిదారులు ఇప్పుడు బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నారు.
MCXలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.135,590 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. MCXలో బంగారం ధరలు రూ.1,34,200 వద్ద ఉన్నాయి. అక్టోబర్ 2023 నుండి బంగారం ధరలు దాదాపు 139 శాతం పెరిగాయి. బంగారం, వెండి ఒక సంవత్సరంలో చాలా రాబడిని ఇచ్చాయి. అందుకే ఈ ధర రాబోయే సంవత్సరం అంటే 2026లో కూడా పెరుగుతుందా అనేది ప్రశ్న చాలా మందిలో ఉంది. నిపుణుల అంచనాల ప్రకారం.. బంగారం ధర వచ్చే ఏడాది కూడా ఇదే విధంగా పెరగవచ్చు.
మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ కమోడిటీస్ VP రాహుల్ కలాంత్రి ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో పెద్ద సంఘటనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ బంగారం, వెండి గత వారం ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. US సెంట్రల్ బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్ రెపో రేటును తగ్గించడం వల్ల వెండి ధర గణనీయంగా పెరిగింది. ఈ సంవత్సరం వెండి ధర దాదాపు 100 శాతం పెరిగింది. ఇదిలా ఉండగా ఈ సంవత్సరం బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ, పెట్టుబడిదారులు ఒక వ్యూహాన్ని రూపొందించుకోవాలి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు, బంగారం ధరల తగ్గుదల మంచి పెట్టుబడి అవకాశంగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి