Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయం.. తులం ఎంత ఉందంటే

| Edited By: Ravi Kiran

Jun 16, 2024 | 4:02 PM

మొన్నటి వరకు ఆకాశమేహద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలకు కాస్త బ్రేక్‌లు పడినట్లు కనిపిస్తోంది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. రానున్న రోజుల్లో మళ్లీ పెళ్లిల సీజన్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ ఆకాశన్నంటే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి...

Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయం.. తులం ఎంత ఉందంటే
Gold Price
Follow us on

మొన్నటి వరకు ఆకాశమేహద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలకు కాస్త బ్రేక్‌లు పడినట్లు కనిపిస్తోంది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. రానున్న రోజుల్లో మళ్లీ పెళ్లిల సీజన్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ ఆకాశన్నంటే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో బంగారం కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆదివారం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,700 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,500కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,550 వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ఊ. 73,150 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 66,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,550గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,500గా ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,550 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,500గా ఉండగా, 24 క్యారెట్ల తులం గోల్డ్‌ ధర రూ. 72,550గా ఉంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,500వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,550గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి కూడా బంగారం బాటలోనే పయణిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగతున్నాయి.. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబయి, కోల్‌కతా, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 91,000 వద్ద కొనసాగుతుండగా, హైదరాబాద్‌, చెన్నై, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 95,600 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..