
Gold Price: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. కనీసం గ్రాము బంగారం కొనాలంటేనే సామాన్యులు భయపడిపోతున్నాయి. ఇప్పుడు దంతేరాస్, దీపావళి పండగకు ముందు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా అక్టోబర్ 14వ తేదీన దిమ్మదిరిగే షాక్ ఇచ్చాయి బంగారం, వెండి ధరలు. ఉదయం 6 గంటల సమయంన ఉంచి 9 గంటల వరకు అంటే కొన్ని గంటల్లోనే బంగారం, వెండి ధరలు భారీగా పెరగడం షాక్‌కు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం తులం బంగారంపై ఏకంగా రూ.3,280 పెరిగింది. అదే వెండిపై ఏకంగా రూ.4000 వరకు ఎగబాకింది. ప్రస్తుతం దేశీయంగా వెండి కిలో ధర రూ.1,89,000 వద్ద ఉంది.
ఇది కూడా చదవండి: Diwali Cleaning: దీపావళికి ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన కవర్.. ఓపెన్ చేసి చూడగా షాకైన కుటుంబీకులు
దేశీయంగా ధరలను చూస్తే.. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,28,680 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,950కి చేరుకుంది. అదే 18 క్యారెట్ల ధర రూ.97,700 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,28,680 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,950 వద్ద ఉంది. ఇక వెండి ధర రూ.2,06,000 వద్ద ఉంది.
బంగారు ఆభరణాల ధరలు నిరంతరం పెరుగుతున్నందున మధ్యతరగతి ప్రజలు వెండి ఆభరణాలపై దృష్టి సారించారు. అయితే, ఇప్పుడు, బంగారం, వెండి రెండింటి ధరలలో వేగవంతమైన పెరుగుదల కారణంగా, సామాన్యులు కృత్రిమ ఆభరణాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.
ఇది కూడా చదవండి: Auto News: దేశ ప్రజల మనస్సు దోచుకున్న బైక్లు.. కేవలం రూ.75వేలలోనే.. మైలేజీ మాత్రం అదుర్స్!
ఇది కూడా చదవండి: Ration Card: ఈ రూల్స్ పాటించాల్సిందే.. లేకుంటే రేషన్ కార్డు రద్దు..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి