రూ. 2 వేల నోట్లు మార్చుకునే వారికి అలర్ట్‌.. గడువు ముగిసేలోపు బ్యాంకులు మూసి ఉండే రోజులివే.

|

May 29, 2023 | 5:41 PM

రెండు వేల రూపాయల నోటును ఉపసంహరించుకుంటూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బ్యాంకుల్లో ఉచితంగా నోట్లను మార్చుకునే వెసులుబాటు కల్పించారు. సెప్టెంబర్‌ 30 తేదీతో ఈ గడువు ముగియనుంది. అయితే సెప్టెంబర్‌ 30 లోపు బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయి..

రూ. 2 వేల నోట్లు మార్చుకునే వారికి అలర్ట్‌.. గడువు ముగిసేలోపు బ్యాంకులు మూసి ఉండే రోజులివే.
Bank Holidays
Follow us on

రెండు వేల రూపాయల నోటును ఉపసంహరించుకుంటూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బ్యాంకుల్లో ఉచితంగా నోట్లను మార్చుకునే వెసులుబాటు కల్పించారు. సెప్టెంబర్‌ 30 తేదీతో ఈ గడువు ముగియనుంది. అయితే సెప్టెంబర్‌ 30 లోపు బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయి, ఏయే రోజుల్లో బ్యాంకులు పనిచేయవో ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంక్ సెలవులు అనేది ఆయా రాష్ట్రాల ఆధారంగా మారుతూ ఉంటాయి. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు నెల వారీగా బ్యాంకులకు సెలవు రోజులపై ఓ లుక్కేయండి..

జూన్‌ నెలలో 12 రోజులు..

జూన్ 15న రాజా సంక్రాంతి, జూన్ 20న రథ యాత్ర, జూన్ 26న కరాచీ పూజ, జూన్ 28న బక్రీద్, జూన్ 29న బక్రీద్, ఈద్ ఉల్ జుహా జూన్ 30న వచ్చింది. అలాగే జూన్ నెలలో ఆది వారాలు ఉన్నాయి. ఇంకా రెండో శనివారం, నాలుగో శనివారం ఉన్నాయి. వీటిని కూడా కలుపుకుంటే.. మొతంగా జూన్ నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు ఉంటాయి.

జూలైలో 15 రోజులు..

ఇక జూల్‌ నెల విషయానికొస్తే మొత్తం 15 రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. జూలై 5న గురు హర్‌గోవింద్ జయంతి, జూన్ 6న ఎంహెచ్‌ఐపీ డే, జూలై 11న కేర్ పూజ, జూలై 13న భాను జయంతి, జూలై 17న యూ టిరోత్ సింగ్ డే, జూలై 21న ద్రుక్పా తేష్ జి, జూలై 28న అశూర, జూలై 29న మొహరం ఉన్నాయి. అంతే కాకుండా ఈ నెలలో కూడా ఆదివారాలు, నాలుగో శనివారం, రెండో శనివారం కూడా ఉన్నాయి. అందువల్ల వీటిని కలుపుకుంటే జూలై నెలలో 15 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు.

ఇవి కూడా చదవండి

ఆగస్టులో 14 రోజులు..

ఆగస్టు నెలలో 8వ తేదీన టెన్‌దోంగ్ హో రమ్ ఫాట్, ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే, ఆగస్ట్ 16న పార్సి న్యూ ఇయర్, ఆగస్ట్ 18న తిథి ఆఫ్ శ్రీమంత శంకరదేవ, ఆగస్ట్ 28న ఫస్ట్ ఓనం, ఆగస్ట్ 29న తిరువోనం, ఆగస్ట్ 30న రక్షాబంధన్, ఆగస్ట్ 31న శ్రీ నారాయణ గురు జయంతి ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా ఆగస్ట్ నెలలో కూడా ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం ఉన్నాయి. ఇవ్వన్నీ కలుపుకుంటే ఆగస్ట్ నెలలో కూడా బ్యాంక్‌లు 14 రోజులు పని చేయవు.

సెప్టెంబర్‌లో 17 రోజులు..

సెప్టెంబర్ 6న శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్ 7న శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్ 18, 19, 20న వినాయక చవితి, సెప్టెంబర్ 22న శ్రీ నారాయణ గురు సమాధి డే, సెప్టెంబర్ 23న మహరాజ హరి సింగ్ జి జయంతి, సెప్టెంబర్ 25న శ్రీమంత శంకరదేవ జన్మోత్సవ్, సెప్టెంబర్ 27న మిలాద్ ఐ షెరిప్, సెప్టెంబర్ 28న ఈద్ ఇ మిలాద్, సెప్టెంబర్ 29న ఇంద్రజత్ర ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో ఇంకా ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం ఉన్నాయి. ఇవి కూడా కలుపుకుంటే సెప్టెంబర్ నెలలో బ్యాంకులు ఏకంగా 17 రోజులు సెలవులు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..