Gig Workers Strike: డిసెంబర్ 31న గిగ్ వర్కర్ల సమ్మెతో వీటిపై భారీ ప్రభావం.. వారి డిమాండ్స్‌ ఏంటి?

Gig Workers Strike: డిసెంబర్‌ 31న గిగ్‌ వర్కర్లు భారీ సమ్మె చేపట్టనున్నారు. ముఖ్యంగా స్విగ్గీ, జొమాటో, బ్లింకింట్‌, జెప్టోతో పాటు ఈ-కామర్స్‌కు సంబంధించిన వర్కర్లు సమ్మె చేపడుతున్నారు. దీంతో ఈ సమ్మె తీవ్ర ప్రభావం చూపనుంది. మరి గిగ్‌ వర్కర్ల సమ్మెతో వేటిపై ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం..

Gig Workers Strike: డిసెంబర్ 31న గిగ్ వర్కర్ల సమ్మెతో వీటిపై భారీ ప్రభావం.. వారి డిమాండ్స్‌ ఏంటి?
Gig Workers Strike

Updated on: Dec 27, 2025 | 8:22 PM

Gig Workers Strike: గిగ్ కార్మికులు డిసెంబర్ 31న దేశవ్యాప్తంగా సమ్మెను ప్రకటించారు. ఇది స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, జెప్టో, ఇతర ఇ-కామర్స్ కంపెనీల డెలివరీలను ప్రభావితం చేస్తుంది. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ మాట్లాడుతూ, ఈ కార్మికులు దిగజారుతున్న పని పరిస్థితులు, ఆదాయాలు పడిపోవడం, భద్రత లేకపోవడం, సామాజిక భద్రత లేకపోవడంపై నిరసన తెలుపుతున్నారని అన్నారు. అయితే డిసెంబర్‌ 31న కార్మికుల సమ్మె చేస్తుండటంతో పలు రంగతాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లుపై పడనుంది.

అలాగే వివిధ కూరగాయలు, ఇతర సూపర్‌ మార్కెట్లపై ప్రభావం పడనుంది. ఎందుకంటే ఈ ఏడాది ముగుస్తుండటంతో డిసెంబర్‌ 31న చాలా మంది పార్టీలు ఏర్పాటు చేసుకుంటారు. ఈ రోజు సాధారణ రోజుల కంటే ఎక్కవ కలెక్షన్‌ ఉంటుంది. ఫుడ్‌ ఆర్డర్లు, ఇతర ఆహార ఉత్పత్తుల ఆర్డర్లు భారీగా ఉంటాయి. ఈ సమ్మె కారణంగా భారీగా ప్రభావం చూపనుంది. ప్రధానంగా ఫుడ్‌ స్టాల్స్‌, రెస్టారెంట్ల, హోటళ్లపై భారీ ఎఫెక్ట్‌ పడనుంది. భారీ స్థాయిలో నష్టాలు చవి చూడాల్సి వస్తుంటుంది. అలాగే ముఖ్యంగా స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకింట్‌ తదితర ఈ కామర్స్‌ కంపెనీలపై తీవ్ర ప్రభవం పడుతుంది.

ఇది కూడా చదవండి: Mega Bank Merger Plan: ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఇవి కూడా చదవండి

కార్మికుల డిమాండ్లు ఏమిటి?

గిగ్ కార్మికులు ప్రధానంగా ఈ 9 డిమాండ్లను చేస్తున్నారు.

  • న్యాయమైన, పారదర్శకమైన వేతన నిర్మాణాన్ని అమలు చేయాలి.
  • 10 నిమిషాల డెలివరీ సదుపాయాన్ని వెంటనే నిలిపివేయాలి.
  • తగిన ప్రక్రియ లేకుండా ఐడి బ్లాక్, జరిమానాను నిలిపివేయాలి.
  • భద్రత కోసం అవసరమైన చర్యలు చేపట్టాలి.
  • అల్గోరిథంల ఆధారంగా వివక్షత ఉండకూడదు. అందరికీ సమాన పని లభించాలి.
  • ప్లాట్‌ఫారమ్‌లు, కస్టమర్‌లను గౌరవంగా చూడాలి.
  • పని సమయంలో విరామాలు ఉండకూడదు. నిర్దేశించిన సమయానికి మించి పని చేయకూడదు.
  • ముఖ్యంగా చెల్లింపు, రూటింగ్ సమస్యలకు యాప్, సాంకేతిక మద్దతు బలంగా ఉండాలి.
  • ఆరోగ్య బీమా, ప్రమాద కవరేజ్, పెన్షన్ వంటి సామాజిక భద్రత.
  • ఈ ప్లాట్‌ఫామ్ కంపెనీలను నియంత్రించాలని కార్మికులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: Electric Scooter: కేవలం రూ.15 వేలు చెల్లించి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకెళ్లండి.. రూ.22,500 డిస్కౌంట్‌.. ఈనెల 31 వరకే ఛాన్స్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి