AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటీ.. బర్త్‌డేకి మ్యూచువల్ ఫండ్‌ని గిఫ్ట్‌గా ఇవ్వొచ్చా? ఈ గిఫ్ట్ కార్డులు కథేంటి?

పెట్టుబడులను బహుమతులుగా ఇచ్చే కొత్త సంస్కృతికి సెబీ తెరతీసింది. మ్యూచువల్ ఫండ్ గిఫ్ట్ కార్డ్‌ల ప్రతిపాదనతో, మీ ప్రియమైన వారికి ఆర్థిక భవిష్యత్తును బహుమతిగా ఇవ్వవచ్చు. వార్షికంగా రూ.50,000 వరకు పెట్టుబడులకు అనుమతి ఉంటుంది. ఒక సంవత్సరం చెల్లుబాటుతో, ఈ కార్డులు సంప్రదాయ బహుమతులకు భిన్నంగా ఆర్థిక అవగాహనను పెంచుతాయి.

ఏంటీ.. బర్త్‌డేకి మ్యూచువల్ ఫండ్‌ని గిఫ్ట్‌గా ఇవ్వొచ్చా? ఈ గిఫ్ట్ కార్డులు కథేంటి?
Mutual Fund Gift Cards
SN Pasha
|

Updated on: Mar 31, 2026 | 10:21 PM

Share

సాంప్రదాయకంగా నగదు లేదా వస్తువులను బహుమతులుగా ఇచ్చే విధానానికి భిన్నంగా, ఇప్పుడు పెట్టుబడులను గిఫ్ట్‌గా ఇవ్వాలనే కొత్త ఆలోచన ముందుకు వస్తోంది. ఈ దిశగా SEBI కీలక ప్రతిపాదన చేసింది. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులను ప్రోత్సహిస్తూ గిఫ్ట్ కార్డ్‌లు లేదా గిఫ్ట్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPIలు) ప్రవేశపెట్టాలని సూచించింది. ఈ విధానం అమలులోకి వస్తే, వ్యక్తులు తమ ప్రియమైన వారికి మ్యూచువల్ ఫండ్ యూనిట్లను బహుమతిగా ఇవ్వగలుగుతారు.

ప్రతిపాదిత విధానం ప్రకారం ఎవరైనా ఈ గిఫ్ట్ కార్డ్‌లను బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ లేదా యూపీఐ ద్వారా కొనుగోలు చేసి, మరొకరికి అందించవచ్చు. గిఫ్ట్ అందుకున్న వ్యక్తి ఆ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి వినియోగించుకోవచ్చు. ఈ కార్డులు జారీ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం వరకు చెల్లుబాటులో ఉంటాయి. దీంతో బహుమతులు కేవలం వినియోగానికి మాత్రమే కాకుండా, భవిష్యత్ సంపద సృష్టికి మార్గంగా మారనున్నాయి.

అయితే ఈ వ్యవస్థలో పారదర్శకత కోసం కొన్ని పరిమితులను కూడా ప్రతిపాదించారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి గరిష్టంగా రూ.50,000 వరకు మాత్రమే ఈ గిఫ్ట్ కార్డ్‌ల ద్వారా పెట్టుబడి పెట్టగలడని సెబీ సూచించింది. ఈ పరిమితిని మించితే, ఆ లావాదేవీ స్వయంచాలకంగా రద్దు చేయబడి, డబ్బు తిరిగి చెల్లించబడుతుంది. అవకతవకలను నివారించేందుకు కఠిన పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయనున్నారు. ఈ ఆలోచనను ముందుకు తెచ్చింది అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా. డిజిటల్ యుగంలో పెట్టుబడులను సులభతరం చేయడం, యువతలో ఆర్థిక అవగాహన పెంచడం ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే, బహుమతుల రూపంలో పెట్టుబడులు ఇవ్వడం అనే కొత్త సంస్కృతి దేశంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్