అన్ని రంగాల్లో దసరా, దీపావళి ఫెస్టివల్ సేల్స్ నడుస్తున్నాయి. ఆన్ లైన్, ఆఫ్ లైన్లలోనూ ఈ డీల్స్ అందుబాటులో ఉంటున్నాయి. కొన్ని ప్రముఖ టూవీలర్ బ్రాండ్లపై కూడా పండుగ ఆఫర్లు ఉన్నాయి. వాటిల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్ ఒబెన్ కూడా దసరా సందర్భంగా అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఈ బ్రాండ్ నుంచి అందుబాటులో ఉన్న రోర్(Rorr) ఎలక్ట్రిక్ బైక్ పై ఏకంగా రూ. 60,000 తగ్గింపును అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఒబెన్ రోర్ ఈ-బైక్ పై టాప్ డీల్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 60,000 వరకూ ఆదా చేసుకునే అవకాశాన్ని కంపెనీ అందిస్తోంది. ఈ డీల్ అక్టోబర్ 12 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆఫర్ వివరాలు చూస్తే.. రూ. 30,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ బైక్ అసలు ఎక్స్ షోరూం ధర రూ. 1.50లక్షల నుంచి రూ. 1.20లక్షలకు తగ్గుతుంది. దీనితో పాటు ఉచిత ఐదేళ్ల పొడిగించిన వారంటీ ఉంటుంది. అదనంగా అక్టోబరు 6న పూణేలో వన్-డే ఈవెంట్‌లను నిర్వహిస్తోంది. ఇక్కడ ఎంపిక చేసిన లక్కీ కస్టమర్‌లు రూ. 60,000 తగ్గింపును అందిస్తోంది. దీని సాయంతో మోటార్‌సైకిల్‌ను కేవలం రూ. 90,000 ఎక్స్-షోరూమ్ కే కొనుగోలు చేయొచ్చు. అలాగే లక్కీ డ్రా ద్వారా ఐఫోన్ 15 వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను అందించనున్నట్లు ఓబెన్ ప్రకటించింది.
మార్కెట్లో ఈ బైక్ కు పెద్దగా డిమాండ్ కనిపించడం లేదు. ఈ క్రమంలో కంపెనీ దసరా ఫెస్టివల్ సేల్స్ లో భాగంగా భారీ డిస్కౌంట్లను ప్రకటించినట్లు తెలుస్తోంది. పండుగ సీజన్ ను క్యాష్ చేసుకుంటూ తమ సేల్స్ పెంచుకునేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి తీసుకొచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ అనేక రకాల ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు ప్రకటించిన ఆఫర్ ఆ వరుసలో వచ్చిన మూడో ఆఫర్. మరి ఈ దసరా అయినా కంపెనీ ఆశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు అవకాశం ఇస్తుందో లేదో చూడాలి.
ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.4కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతోకూడిన బ్యాటరీతో వస్తుంది. 8కేడబ్ల్యూ మోటార్ ఉంటుంది. గరిష్టంగా గంటకు 100కిలోమీటర్ల వేగంతో ప్రయణిస్తుంది. సింగిల్ చార్జ్ పై 187కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇక ఫీచర్లను పరిశీలిస్తే ఎల్ఈడీ లైటింగ్, డిజిటల్ స్క్రీన్, మూడు రైడింగ్ మోడ్స్, యూఎస్బీ చార్జింగ్ పోర్టు వంటి ఫీచర్లను పొందుతుంది. మన మా
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..