Get Discounts Of Up To Rs 38,000 On Maruti Suzuki Cars
కొత్త సంవత్సరం మొదటి నెలలో మారుతి సుజుకి తన కార్లపై రూ.38,000 వరకు డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ క్రమంలోనే మారుతి సుజుకి తన కార్ల (మారుతి ఆల్టో కె10, ఎస్ ప్రెస్సో, వ్యాగన్ ఆర్, సెలెరియో, ఆల్టో 800, డిజైర్,స్విఫ్ట్‌ల)పై నగదు తగ్గింపులు, కార్పొరేట్ ప్రయోజనాలు, ఎక్స్‌చేంజ్ బోనస్‌లను ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ జనవరి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
- మారుతి ఆల్టో K10 – రూ. 38,000 వరకు: మారుతి ఆల్టో K10 మాన్యువల్, CNG వేరియంట్లు రూ. 38,000 వరకు డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. హ్యాచ్‌బ్యాక్‌కి రూ. 15,000 నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ. 8,000 కార్పొరేట్ ప్రయోజనం లభిస్తుంది. మరోవైపు, Alto K10 AMT వేరియంట్లు కూడా రూ. 23,000 తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. వీటిపై రూ. 15,000 విలువైన ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ. 8,000 కార్పొరేట్ ప్రయోజనం ఉన్నాయి. ఈ ఆఫర్ జనవరి 31 వరకు మాత్రమే.
- మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో – రూ. 36,000 వరకు: ఎస్ ప్రెస్సో బేస్ వేరియంట్లపై రూ. 36,000 వరకు ఆఫర్‌ను అందిస్తోంది మారుతి సుజుకి . ఇది రూ. 15,000 నగదు తగ్గింపు, రూ. 15,000 విలువైన ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ. 6,000 కార్పొరేట్ తగ్గింపుతో ఉంది. మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో AMT వేరియంట్లు రూ. 21,000 వరకు తగ్గింపును పొందుతాయి. CNG వేరియంట్‌లు గరిష్టంగా రూ. 35,100 వరకు తగ్గింపును పొందుతాయి. ఇందులో రూ. 15,000 వరకు నగదు తగ్గింపు, రూ. 5,100 కార్పొరేట్ ప్రయోజనాలు, రూ. 15,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ లభిస్తాయి.
- మారుతీ సుజుకి వ్యాగన్ ఆర్ – రూ. 33,000 వరకు: మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ పెట్రోల్ MT వేరియంట్లు జనవరి 2023లో రూ. 33,000 తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. దీనికి రూ. 10,000 నగదు తగ్గింపు, రూ. 15,000 విలువైన ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ. 8,000 కార్పొరేట్ తగ్గింపు లభిస్తుంది. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ పెట్రోల్ AMT, CNG వేరియంట్లపై కస్టమర్లు వరుసగా రూ. 30,100, రూ. 23,000 తగ్గింపులను పొందవచ్చు.
- మారుతి సుజుకి సెలెరియో – రూ. 31,000 వరకు: మారుతి సుజుకి సెలెరియో దాని మాన్యువల్ వేరియంట్లపై రూ. 31,000 తగ్గింపును పొందుతుంది. అయితే AMT వేరియంట్లు మొత్తం రూ. 21,000 తగ్గింపుతో ఉంటాయి. అలాగే సెలెరియో CNG వేరియంట్లు రూ. 30,100 నగదు తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి.
- మారుతీ సుజుకి ఆల్టో 800 – రూ. 31,000 వరకు: ఆల్టో 800 హైయర్ వేరియంట్లపై వినియోగదారులు రూ. 31,000 వరకు తగ్గింపును పొందవచ్చు. మరోవైపు బేస్ వేరియంట్లు రూ. 11,000 వరకు తగ్గింపును పొందుతాయి. ఇక సిఎన్‌జి వేరియంట్లు మొత్తం రూ. 30,100 తగ్గింపుతో లభిస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..