ప్రస్తుతం అన్ని ప్లాట్ ఫాంలు, అన్ని రంగాల్లోనూ ఆఫర్ల జాతర నడుస్తోంది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ప్రత్యేకంగా సేల్స్ ను అన్ని కంపెనీలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ద్విచక్ర తయారీదారులు టీవీఎస్ కూడా పలు ప్రత్యేక డీల్స్ ను ప్రకటించింది. తన పోర్టు ఫోలియోలోని ఎలక్ట్రిక్ వేరియంట్ స్కూటర్ ఐక్యూబ్ పై ఈ ఫెస్టివల్ డిస్కౌంట్లను అందిస్తోంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ. 20,000 వరకూ పలు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఐక్యూబ్ 2.2కేడబ్ల్యూహెచ్, ఐక్యూబ్ 3.4 కేడబ్ల్యూహెచ్, ఐక్యూబ్ ఎస్ 3.4కేడబ్ల్యూహెచ్ వేరియంట్లపై ఈ ప్రత్యేకమైన ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ కొత్త ఫెస్టివల్ డిస్కౌంట్ 2024 అక్టోబర్ 31 వరకూ అందుబాటులో ఉంటుంది.
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తే రూ. 17,300 క్యాష్ బ్యాక్ వస్తుంది. దీనితో 2.2కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ధర రూ. 89,999(ఎక్స్ షోరూం)కి తగ్గుతుంది. అదే సమయంలో ఐక్యూబ్ 3.4కేడబ్ల్యూహెచ్ వేరియంట్ పై రూ. 10,000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీనితో ఆ స్కూటర్ ధర రూ. 1.27లక్షలు(ఎక్స్ షోరూం)కి తగ్గుతుంది. అయితే టీవీఎస్ ఐక్యూబ్ 3.4కేడబ్ల్యూహెచ్ వేరియంట్ పై ఎలాంటి క్యాష్ బ్యాక్ ఉండదు కానీ ఐదేళ్ల వరకూ లేదా 70,000 కిలోమీటర్ల వరకూ ఎక్స్ టెండెడ్ వారంటీ లభిస్తుంది. దీని విలువ రూ. 5,999గా ఉంది. ఈ ఆఫర్లు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని టీవీఎస్ డీలర్ షిప్స్ వద్ద అందుబాటులో ఉంటుంది.
ఇటీవల కొత్తగా లాంచ్ చేసిన టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ వేరియంట్ పై మాత్రం ఎలాంటి ఆఫర్ లేదని కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త వేరియంట్ 3.4కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. దీని ధర రూ. 1.55లక్షలు(ఎక్స్ షోరూం). అదే సమయంలో 5.1కేడబ్ల్యూహెచ్ ట్రిమ్ ధర రూ. 1.85లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది. అన్ని వేరియంట్లు గరిష్టంగా 78కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. వీటి రేంజ్ 75కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వరకూ వాటి బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి అందిస్తుంది. మార్కెట్లో ఏథర్, బజాజ్ చేతక్, యాంపియర్ నెక్సస్, ఓలా ఎస్1 ప్రో వంటి మోడళ్లు టీవీఎస్ ఐక్యూబ్ నకు పోటీగా ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..