Gautam Adani: ఇండియాలో అపర కుభేరుడు.. ప్రపంచంలో సెకండ్ రిచ్చెస్ట్ పర్సన్.. అదానీ ఒక్క రోజు సంపాదన ఎంతో తెలుసా?

|

Sep 22, 2022 | 6:05 AM

Gautam Adani: ఇండియాలో అపర కుభేరుడు.. ప్రపంచంలో సెకండ్ రిచ్చెస్ట్ పర్సన్.. అదానీ ఒక్క రోజు సంపాదన ఎంతో తెలుసా? ఏడాదిలో ఆయన ఆస్తులు ఎన్ని రెట్లు పెరిగాయో తెలుసా?..

Gautam Adani: ఇండియాలో అపర కుభేరుడు.. ప్రపంచంలో సెకండ్ రిచ్చెస్ట్ పర్సన్.. అదానీ ఒక్క రోజు సంపాదన ఎంతో తెలుసా?
Gautam Adani
Follow us on

Gautam Adani: ఇండియాలో అపర కుభేరుడు.. ప్రపంచంలో సెకండ్ రిచ్చెస్ట్ పర్సన్.. అదానీ ఒక్క రోజు సంపాదన ఎంతో తెలుసా? ఏడాదిలో ఆయన ఆస్తులు ఎన్ని రెట్లు పెరిగాయో తెలుసా? తెలిస్తే షాకవుతారు. అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ సంపద జెట్ స్పీడ్‍‌తో పెరుగుతోంది. సంవత్సరాలు, నెలలు కాదు గంటల వ్యవధిలోనే ఆయన ఆస్తులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నాయి. ఈ బిలీనియర్ ఒక్కరోజు సంపద అక్షరాలా.. 1,612 కోట్ల రూపాయలు. అహ్మదాబాద్‌కు చెందిన అదానీ సంపద ఏడాదిలోనే 116 శాతం పెరిగింది. గడిచిన ఒక్క ఏడాదిలోనే ఏకంగా 5.88 లక్షల కోట్లు అదానీ సంపాదించారు. దీంతో ఆయన సంపద 10.94 లక్షల కోట్లకు ఎగిసినట్టు ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ రిచ్ లిస్టు తెలిపింది. 2022 భారతీయ సంపన్నుల జాబితా ప్రకారం గౌతమ్ అదానీనే టాప్‌లో నిలిచారు. ఆయన తర్వాత రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ రెండో స్థానానికి పరిమితమయ్యారు. గడిచిన పదేళ్లుగా ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్న ముకేశ్‌ అంబానీని గౌతమ్‌ అదానీ వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌లోకి వచ్చారాయన. ప్రస్తుతం ముకేశ్‌ సంపద 7.94 లక్షల కోట్లుగా ఉంది. గడిచిన ఏడాదిలో ముకేశ్‌ సంపద 11 శాతం పెరగ్గా.. ఐదేళ్లలో 115 శాతం పెరిగినట్లు ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ నివేదికలో స్పష్టం చేసింది.

అదానీ గ్రూప్‌ పేరుతో 7 కంపెనీల కార్యకలాపాలు:

అదానీ గ్రూప్ పేరుతో మొత్తం 7 కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 11 లక్షల కోట్లకు చేరింది. ఏడాదిలోనే గౌతమ్ అదానీ సంపద రెండింతలకు పైగా పెరిగింది. కార్పొరేట్‌ రంగంలో సడన్‌ స్టార్‌గా‌ ఎప్పటికప్పుడు రికార్డులు బద్దలు కొడుతున్న గౌతమ్ అదానీ… మరో మెట్టు పైకెక్కేశారు. టాప్‌10 ఫోర్బ్స్‌ బిలియనీర్స్ లిస్టులో నంబర్‌టూ ప్లేస్‌లో నిలిచారు అదానీ. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టి, ఆయన ప్రపంచ రెండవ కుబేరుడిగా నిలిచారు. మరోవైపు 1.6 ట్రిలియన్ల నికర విలువతో అదానీ తమ్ముడు వినోద్ అదానీ కూడా ఇండియాలోనే ఆరో సంపన్నుడి స్థానంలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి