Adani: రెండు నుంచి మూడుకు.. ప్రపంచ కుబేరుల జాబితాలో పడిపోయిన అదానీ ర్యాంక్..

|

Sep 28, 2022 | 11:28 AM

భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి పడిపోయారు. కొన్ని రోజులుగా ట్రేడింగ్ లో ప్రతికూల ధోరణులు అదానీ గ్రూప్ షేర్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఒక్కరోజే అదానీకి..

Adani: రెండు నుంచి మూడుకు.. ప్రపంచ కుబేరుల జాబితాలో పడిపోయిన అదానీ ర్యాంక్..
Gautam Adani
Follow us on

భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి పడిపోయారు. కొన్ని రోజులుగా ట్రేడింగ్ లో ప్రతికూల ధోరణులు అదానీ గ్రూప్ షేర్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఒక్కరోజే అదానీకి రూ.57 వేల కోట్ల నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. కాగా ఇటీవలే ఆయన రెండో స్థానానికి ఎగబాకి వ్యాపార ప్రపంచం దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు. కొన్నేళ్లుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వస్తున్న అదానీ కీలక రంగాల్లో తన వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారు. దీంతో అదే స్థాయిలో అదానీ సంపాదన పెరుగుతూ వచ్చింది. తాజాగా బ్లూమ్‌ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ మూడవ స్థానానికి చేరుకున్నారు. 137 బిలియన్ డాలర్ల సంపాదనతో ప్రాన్స్ కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ ను అదాని వెనక్కు నెట్టారు. మొదటి స్థానంలో ఎలన్ మస్క్ 251 బిలియన్ డార్లతో నిలవగా, జెఫ్ బెజోస్ 155 బిలియన్ డాలర్ల సంపాదనతో రెండవ స్థానంలో నిలిచారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో ఒక ఆసియా వ్యక్తి మొదటి మూడు స్థానాల్లోకి ప్రవేశించడం ఇదే మొదటి సారి. గతంలో ముకేష్ అంబానీ, చైనాకు చెందిన జాక్ మా కుబేరుల జాబితాలో తొలి ఐదు స్థానాలకు చేరుకున్నప్పటికీ మూడవ స్థానానికి చేరుకోలేక పోయారు.

అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌, ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ను వెనక్కి నెట్టి అదానీ రెండో స్థానానికి ఎగబాకారు. ఈ స్థాయికి చేరిన తొలి భారత, ఆసియా వ్యక్తి అదానీయే. ఫోర్బ్స్‌ వివరాల ప్రకారం అదానీ గ్రూప్ షేర్లతో కలిసి ఆయన సంపద 5.5 బిలియన్‌ డాలర్లు పెరిగింది. 155.7 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో కుబేరుల జాబితాలో రెండో స్థానానికి చేరారు. విలాస వస్తువుల కంపెనీ ఎల్‌వీఎంహెచ్‌ అధినేత బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 155.2 బి.డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. భారత్‌కు చెందిన మరో కుబేరుడు ముకేశ్‌ అంబానీ ఈ జాబితాలో 92.3 బిలియన్‌ డాలర్ల సంపదతో 8వ స్థానంలో నిలిచారు.

వజ్రాల ట్రేడింగ్‌ నుంచి కాలేజ్ ఎడ్యుకేషన్ ను మధ్యలోనే ఆపేసిన అదానీ, తొలుత వజ్రాల ట్రేడింగ్‌ చేశారు. బొగ్గు వ్యాపారిగా మారాకే ఆయన దశ తిరిగింది. బొగ్గు గనులతో ప్రారంభించి.. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, సిటీగ్యాస్‌ పంపిణీ, సిమెంటు తయారీ, డేటా కేంద్రాలు, విద్యుదుత్పత్తి రంగాలకు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి, సంపద విలువను అనూహ్యంగా పెంచుకున్నారు. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అదానీ నిలిచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి