Richest Person: దేశంలోనే శ్రీమంతుడు అదానీ.. రెండో స్థానానికి పడిపోయిన అంబానీ..
మన దేశంలో అత్యంత సంపన్న వ్యక్తి ఎవరంటే సాధారణంగా రిలయన్స్ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ పేరు గుర్తుకువస్తుంది. ఈయనే దేశంలో నంబర్ వన్ ధనవంతుడు అని ప్రజలు భావిస్తారు. కానీ ఇప్పుడు ముఖేష్ అంబానీ రెండో స్థానానికి పడిపోయారు. ఆయన స్థానంలో దేశంలో అత్యంత సంపన్న వ్యక్తిగా ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ నిలిచారు.

నంబర వన్ స్థానానికి ఎప్పుడు ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉంటుంది. దాన్ని సాధించడానికి అన్ని రంగాలలో పోటీ పడతారు. చదువుకునే సమయంలో పాఠశాలల స్థాయిలో మొదలైన నంబర్ వన్ రేస్ జీవితాంతం అనేక విధాలుగా పరుగులు పెట్టిస్తుంది. చదువు, ఉద్యోగం, వ్యాపారం, క్రీడలు ఇలా ప్రతి చోటా నేనున్నానంటూ గుర్తు చేస్తుంది. ఏ ఒక్కరి దగ్గరా స్థిరంగా ఉండని దీని కోసం పోటీ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది.
దేశంలో అత్యంత సంపన్నుడు..
మన దేశంలో అత్యంత సంపన్న వ్యక్తి ఎవరంటే సాధారణంగా రిలయన్స్ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ పేరు గుర్తుకువస్తుంది. ఈయనే దేశంలో నంబర్ వన్ ధనవంతుడు అని ప్రజలు భావిస్తారు. కానీ ఇప్పుడు ముఖేష్ అంబానీ రెండో స్థానానికి పడిపోయారు. ఆయన స్థానంలో దేశంలో అత్యంత సంపన్న వ్యక్తిగా ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ నిలిచారు.
ఆసియాలోనే నంబర్ వన్..
మన దేశంతో పాటు ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదానీ నిలిచారు. ఆయన పోర్ట్‌ఫోలియో కంపెనీల స్టాక్ సోమవారం దాదాపు 10 శాతం పెరిగింది. దీంతో ఆయన అంబానీని వెనకకు నెట్టి మొదటి స్థానాన్ని ఆక్రమించారు.
పెరిగిన స్టాక్ విలువ..
ప్రస్తుతం గౌతమ్ అదానీ నికర విలువ 111 బిలియన్ల యూఎస్ డాలర్లు కాగా, ముఖేష్ అంబానీ ఆస్తి విలువ 109 బిలియన్ డాలర్లుగా ఉంది. వారిద్దరి మధ్య కేవలం 2 బిలియన్ డాలర్లు మాత్రమే తేడా ఉన్నప్పటికీ గ్రూప్ కంపెనీల స్టాక్‌లో పెరుగుదల కారణంగా అదానీ సంపద పెరుగుదల చాలా వేగంగా ఉంది. అంబానీతో పోలిస్తే గౌతమ్ అదానీ ఆస్తుల విలువ భారీగా పెరిగింది. ఇటీవల విడుదలైన లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ తర్వాత అదానీ గ్రూప్ స్టాక్ పెరిగింది. సోమవారం మార్కెట్లు ప్రారంభమైన తర్వాత అదానీ పోర్ట్‌ఫోలియో కంపెనీల స్టాక్ దాదాపు 10 శాతం పెరిగి, టాప్ గెయినర్‌గా నిలిచింది.
ఐదేళ్లుగా స్థిరమైన అభివృద్ధి..
ఆఫ్రికా ఖండంలోని టాంజానియా పోర్ట్స్ అథారిటీతో అదానీ పోర్ట్స్ గత వారం 30 ఏళ్ల రాయితీ ఒప్పందంపై సంతకం చేసింది. దాని ప్రకారం ఆ దేశంలోని దార్ ఎస్ సలామ్ పోర్ట్‌లో కంటైనర్ టెర్మినల్ 2 (సీటీ2)ని నిర్వహించనుంది. అదానీ కంపెనీల పోర్ట్‌ఫోలియో గత ఐదేళ్ల నుంచి స్థిరమైన వృద్ధిని సాధిస్తున్నాయి.
దేశంలో ఐదుగురు సంపన్నులు..
అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదానీ 111 బిలియన్ల యూఎస్ డాలర్లతో దేశంలో మొదటి స్థానంలో ఉన్నారు. రిలయన్స్ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ 109 బిలియన్ల యూఎస్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత షాపూర్ మిస్త్రీ 36.1 బిలియన్ల యూఎస్‌డీ, సావిత్రి జిందాల్ 32.6 బిలియన్ల యూఎస్‌డీ, శివ్ నాడార్ 31.6 బిలయన్ల యూఎస్‌డీ నికర ఆస్తులతో తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




