ఈ రోజు నుంచి జీయస్టీ 2.0 అమలు కానుంది. ఈ కొత్త ట్యాక్స్ విధానంతో ఎలక్ట్రానిక్స్ నుంచి కార్స్ వరకూ.. ఇలా చాలా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్స్ లో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. కార్స్ పై ఎక్కువ మొత్తంలో తగ్గింపు కనిపిస్తోంది. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
కొత్తగా అమలులోకి వచ్చిన జీయస్టీ విధానం వల్ల కార్ల రేట్లు భారీగా తగ్గనున్నాయి. కారు కొనాలనుకునేవారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. అయితే అసలు మార్కెట్లో ఉన్న ఏయే కార్ పై ఎంత తగ్గింపు ఉంది. ఈ ఫుల్ డిటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.
టాటా మోటార్స్
టాటా కార్లపై బాగానే తగ్గింపు కనిపిస్తుంది. ఫుల్ లిస్ట్ చూస్తే..
టాటా నెక్సాన్: రూ. 1.55 లక్షలు
టాటా సఫారీ: రూ. 1.45 లక్షలు
టాటా హారియర్: రూ. 1.40 లక్షలు
ఆల్ట్రోజ్: రూ. 1.10 లక్షలు
పంచ్: రూ. 85,000
టైగోర్: రూ. 80,000
టాటా టియాగో: రూ. 75,000
కర్వ్: రూ. 65,000 తగ్గింపు లభిస్తోంది
మహీంద్రా
మహింద్రాలో దాదాపు అన్ని కార్లపై రూ. లక్ష వరకూ తగ్గింపు ఉంది. ఫుల్ లిస్ట్ చూస్తే..
స్కార్పియో ఎన్: రూ. 1.45 లక్షలు
ఎక్స్‌యూవీ 700: రూ. 1.43 లక్షలు
ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ధర రూ. 1.40 లక్షలు
థార్: రూ. 1.35 లక్షల వరకు తక్కువ
థార్ రాక్స్: రూ. 1.33 లక్షల తగ్గింపు
మహింద్రా బొలెరో నియో: రూ. 1.27 లక్షలు
స్కార్పియో క్లాసిక్: రూ. 1.01 లక్షల తగ్గింపు లభిస్తోంది
టొయోటా
టొయోటా మోడల్స్ పై మరింత తగ్గింపు కనిపిస్తోంది. ఫుల్ లిస్ట్ లోకి వెళ్తే..
టొయోటా ఫార్చ్యూనర్ పై రూ. 3.49 లక్షలు
లెజెండర్ పై రూ. 3.34 లక్షలు
టొయోటా వెల్‌ఫైర్ పై రూ. 2.78 లక్షలు
హిల్లక్స్ ట్రక్ పై రూ. 2.52 లక్షలు
ఇన్నోవా క్రిస్టాపై రూ. 1.80 లక్షల తగ్గింపు
ఇన్నోవా హైక్రాస్ పై రూ. 1.15 లక్షల తగ్గింపు
టొయోటా క్యామ్రీపై రూ. 1.01 లక్షల తగ్గింపు లభిస్తోంది.
హ్యుందాయ్ కార్లలో
టక్సన్ పై రూ. 2.4 లక్షలు
వెన్యూపై రూ. 1.23 లక్షలు
ఐ20 పై రూ. 98,053
ఎక్స్‌టర్ పై రూ. 89,209
హ్యుందాయ్ ఆరాపై రూ. 78,465
అల్కజార్: రూ. 75,376
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ పై రూ. 73,808
క్రెటాపై రూ. 72,145
వెర్నాపై రూ. 60,640 తగ్గింపు లభిస్తోంది.
మారుతి సుజుకి ఫుల్ లిస్ట్ లోకి వెళ్తే..
ఆల్టో కే10పై రూ. 40,000
ఎర్టిగాపై రూ. 41,000
వ్యాగన్ఆర్ పై రూ. 57,000
బాలెనోపై రూ. 60,000
ఫ్రాంక్స్ పై రూ. 68,000
స్విఫ్ట్ పై రూ. 58,000
డిజైర్ పై రూ. 61,000
సెలెరియోపై రూ. 50,000
బ్రీజాపై రూ. 78,000
ఈకోపై రూ. 51,000
ఎస్-ప్రెస్సోపై రూ. 38,000
ఇగ్నిస్ పై రూ. 52,000
జిమ్నీ పై రూ. 1.14 లక్షలు
ఇన్విక్టో పైరూ. 2.25 లక్షల
ఎక్స్ఎల్6 పై రూ. 35,000 తగ్గింపు లభిస్తుంది.
కియా కార్ల విషయానికొస్తే..
కియా కార్నివాల్ పై రూ. 4.48 లక్షలు
కియా సిరోస్ పై రూ. 1.86 లక్షలు
కియా సోనెట్ పై రూ. 1.64 లక్షలు
కారెన్స్ క్లావిస్ పైరూ. 78,674 తగ్గింపు
సెల్టోస్ పై రూ. 75,372
కియా కారెన్స్ పై రూ. 48,513 తగ్గింపు లభిస్తోంది.
ఇకపోతే రెనాల్ట్ కైగర్ పై రూ. 96,395 తగ్గింపు, స్కోడా కోడియాక్ పై రూ. 3.3 లక్షల తగ్గింపు, స్కోడా కుషాక్ పై రూ. 66,000 , స్కోడా స్లావియాపై రూ. 63,000 తగ్గింపు లభిస్తోంది.