Petrol Prices: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండో రోజు.. ఒకేసారి ఎంతంటే..?

దేశ ప్రజలకు బిగ్ షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. శుక్రవారం పవర్ పెట్రోల్, పారిశ్రామిక డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. పవర్ పెట్రోల్ ధర లీటర్‌పై రూ.2 పెరగ్గా.. శుక్రవారం నుంచే పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి.

Petrol Prices: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండో రోజు.. ఒకేసారి ఎంతంటే..?
Petrol Prices

Updated on: Mar 21, 2026 | 11:31 AM

శుక్రవారం దేశంలో పవర్ పెట్రోల్ ధర లీటర్‌పై రూ.2 పెరగ్గా.. ఇక పారిశ్రామిక డీజిల్ ధర లీటర్‌పై రూ.87.67 నుంచి రూ.109.59కి పెరిగింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతుండటం, దాని సరఫరాకు అంతరాయం కలుగుతున్న క్రమంలో సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా అతి త్వరలోనే పెరగవచ్చని తెలుస్తోంది. అంతర్జాతీయంగా యుద్ద పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోకపోతే ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశముందని సమాచారం.

వరుసగా రెండో రోజు పెరిగిన ధరలు

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం, గల్ప్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడుల క్రమంలో దేశంలో ఇప్పటికే గ్యాస్ ధరలు పెరగ్గా.. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా క్రమక్రమంగా పెరుగుతున్నాయి. పవర్ పెట్రోల్, పారిశ్రామిక పెట్రోల్ ధరలను పెంచడం చూస్తే.. కొద్ది రోజుల్లో నార్మల్ పెట్రోల్ ధరలు కూడా పెంచే అవకాశం లేకపోలేదు. దేశంలో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతుండటంతో రానున్న కొద్ది రోజుల్లో డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. ఇతర దేశాల్లో ఇప్పటికే ధరలు పెరగ్గా.. భారత్‌లోనూ పెరుగుతాయని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే దేశంలో వరుసగా రెండో రోజు పెట్రోల్ ధరలు ఎగబాకాయి. రెండు రోజుల్లో నార్మల్ పెట్రోల్‌పై లీటర్‌కు 40 పైసలకుపైగా పెరిగింది.

చెన్నైలో పెరిగిన ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఒక ఒక్కొ రాష్ట్రంలో ఒక్కొలా ఉంటాయి. రాష్ట్రాలు విధింటే ట్యాక్సులు, సెస్‌లు, రవాణా ఛార్జీలను బట్టి ధరలు మారుతూ ఉంటాయి. అందులో భాగంగా చెన్నైలో పెట్రోల్ రేట్లు వరుసగా రెండో రోజు పెరిగాయి. ఐఓసీఎల్ వెబ్‌సైట్‌లోని డేటా ప్రకారం ఇవాళ చెన్నైలో పెట్రోల్ రేటు లీటర్‌పై 17 పైసలు పెరిగి రూ.101.06 నుంచి రూ.101.23కి చేరుకుంది. ఇక డీజిల్ 20 పైసలు పెరిగి రూ.92.61 నుంచి రూ.92.81కి ఎగబాకాయి. రెండు రోజుల్లో పెట్రోల్ 43 పైసలు, డీజిల్ 42 పైసలు తగ్గాయి.

మిగతా నగరాల్లో రేట్లు ఇవే..

ఇక మిగతా నగరాల్లో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.94.77, డీజిల్ రూ.87.67 వద్ద కొనసాగుతున్నాయి. ఇక కోల్ కత్తాలో పెట్రోల్ రూ.105.41, డీజిల్ రూ.92.02 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఇక ముంబైలో పెట్రోల్ రూ.103.54, డీజిల్ రూ.90.03 వద్ద ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు 3 శాతం పెరిగాయి. శుక్రవారం బ్రెంట్ ముడి చమురు 3.54 శాతం పెరిగి బ్యారెల్‌కు 112.19 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక యూఎస్ ముడి చమురు 2.68 శాతం పెరిగి బ్యారెల్‌కు 98.23 డాలర్లకు చేరుకున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us