వారంలో తొలి ట్రేడింగ్ రోజైన సోమవారం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగాయి. సోమవారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.85 శాతం పెరిగి 71.17 డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో, WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు 2.02 శాతం పెరిగి 67.60 డాలర్లకు చేరుకుంది. క్రూడాయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో చమురు కంపెనీలు సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి.
దేశంలోని ప్రధాన చమురు కంపెనీలు IOC, BPCL మరియు HPCL నేడు ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. డిసెంబర్ 6న రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.97 కాగా, డీజిల్ ధర రూ.86.67గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98, డీజిల్ ధర రూ.94.14గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.40, లీటర్ డీజిల్ ధర రూ.91.43గా ఉంది. కోల్‌కతాలో ఈరోజు పెట్రోల్ లీటరుకు రూ.104.67, డీజిల్ లీటరుకు రూ.89.79 చొప్పున విక్రయిస్తున్నారు.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.39గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.79గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.90గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.25గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.72గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.11గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 ఉండగా.. డీజిల్ ధర రూ.94.62గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.50కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.46లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.32 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.43గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.50లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.52గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.02గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.13గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.67 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.74లకు లభిస్తోంది.
Read Also.. LIC IPO: ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసీ ఐపీఓ.. పాలసీదారులకు 10 శాతం రిజర్వ్..