Petrol, Diesel Prices Today: డిసెంబర్ 2, గురువారం వరుసగా 28వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు మారలేదు. అయితే ఢిల్లీలో మాత్రం పెట్రోల్ ధర తగ్గింది. ఢిల్లీ ప్రభుత్వం బుధవారం పెట్రోల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ని 30 శాతం నుంచి 19.40 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయంతో దేశ రాజధానిలో గురువారం నుంచి పెట్రోల్ ధరలు లీటరుకు ₹ 8.56 తగ్గింది. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)లోని ఇతర నగరాలతో పోలిస్తే ఢిల్లీలో ఇంధన ధరలు ఇప్పుడు చౌకగా మారాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అయితే, ఢిల్లీలో డీజిల్ ధర యథాతథంగా ₹ 86.67 ఉంది.
ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంధన ధరలు మారలేదు. ముంబైలో పెట్రోల్ లీటరుకు ₹ 109.98 ఉండగా.. డీజిల్‌ను లీటరుకు ₹ 94.14గా ఉంది. మెట్రో నగరాల్లో ముంబైలో ఇంధన ధరలు అత్యధికంగా ఉన్నాయి. చెన్నైలో పెట్రోల్ లీటరుకు రూ. 101.40 ఉండగా.. డీజిల్‌ను లీటరుకు రూ. 91.43గా ఉంది. కోల్‌కత్తాలో పెట్రోల్ లీటరుకు రూ.104.67 ఉండగా.. డీజిల్‌ను లీటరుకు రూ. 89.79గా ఉంది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వరంగ చమురు శుద్ధి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌లలో ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకపు ధరలను పరిగణనలోకి తీసుకుని రోజువారీగా ఇంధన ధరలను సవరిస్తాయి. పెట్రోల్ మరియు డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలులోకి వస్తాయి.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.39గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.79గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.90గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.25గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.72గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.11గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 ఉండగా.. డీజిల్ ధర రూ.94.62గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.50కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.46లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.32 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.43గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.50లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.52గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.02గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.13గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.67 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.74లకు లభిస్తోంది.
Read Also… HDFC Bank: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ.. ఎంత పెరిగాయంటే..