Personal Finance: ఈ నాలుగు పనులను డిసెంబర్ 31లోగా పూర్తి చేయండి.. లేకుంటే..

|

Dec 26, 2021 | 11:00 AM

మరో నాలుగు రోజుల్లో 2021 ముగుస్తుంది. అయితే ఈ లోపు డబ్బుకు సంబంధించిన కొన్ని పనులను పూర్తి చేయాలి...

Personal Finance: ఈ నాలుగు పనులను డిసెంబర్ 31లోగా పూర్తి చేయండి.. లేకుంటే..
December 31
Follow us on

మరో నాలుగు రోజుల్లో 2021 ముగుస్తుంది. అయితే ఈ లోపు డబ్బుకు సంబంధించిన కొన్ని పనులను పూర్తి చేయాలి. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం నుంచి వార్షిక జీవిత ధృవీకరణ పత్రం వరకు మీరు డిసెంబరు 31 నాటికి పూర్తి చేయాలి. మీరు ఈ పనులు చేయడంలో విఫలమైతే మీరు నష్టపోవాల్సి రావచ్చు.

ప్రభుత్వ పదవీ విరమణ పొందిన వారి వార్షిక జీవిత ధృవీకరణ పత్రాన్ని(లైఫ్ సర్టిఫికేట్) సమర్పించడానికి డిసెంబర్ 31, 2021 వరకు పొడిగించబడింది. పదవీ విరమణ పొందినవారు పెన్షన్ పొందడం కొనసాగించడానికి వారి జీవిత ధృవీకరణ పత్రాన్ని సకాలంలో సమర్పించడం చాలా ముఖ్యం. పెన్షనర్లు వ్యక్తిగతంగా శాఖలను సందర్శించడం ద్వారా లేదా ఆన్‌లైన్ ద్వారా ఈ ప్రమాణపత్రాన్ని సమర్పించవచ్చు. మీరు ఇంటి వద్ద కూర్చొని ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలనుకుంటే, దీని కోసం మీరు జీవన్ ప్రమాణ్ (https://jeevanpramaan.gov.in/) పోర్టల్‌ను సందర్శించాలి.

2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి ప్రభుత్వం గడువును డిసెంబర్ 31, 2021 వరకు పొడిగించింది. ITR గడువు రెండుసార్లు పొడిగించారు. ముందుగా సాధారణ గడువు జూలై 31 నుంచి సెప్టెంబర్ 30, 2021 వరకు ఆ తరువాత డిసెంబర్ 31 వరకు పొడగించారు. కొత్త ఆదాయపు పన్ను పోర్టల్‌లోని అవాంతరాల కారణంగా గడువు పొడగించారు. చాలా మంది పన్ను చెల్లింపుదారులు తమ ITR ఫైలింగ్ ప్రక్రియను పూర్తి చేయడం కష్టం. మీ ఆదాయం 5 లక్షల వరకు ఉంటే రూ.1000 ఆలస్య రుసుము, మీ ఆదాయం 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఆలస్య రుసుము రూ. 10,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. మీ పన్ను బకాయి ఉండి, డిసెంబర్ 31లోపు మీరు రిటర్న్‌ను ఫైల్ చేయకుంటే, ఒక రోజు ఆలస్యమైనా, మీరు నెల మొత్తానికి 1 శాతం చొప్పున వడ్డీని చెల్లించాలి.

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలను KYC-కంప్లైంట్ చేయడానికి గడువును 30 సెప్టెంబర్ 2021 నుండి 31 డిసెంబర్ 2021 వరకు పొడిగించింది. ఏప్రిల్ 2021లో SEBI జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం డిపాజిటరీలు అంటే NSDL,CDSLలో ఇప్పటికే ఉన్న డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలలో ఆరు ముఖ్యమైన KYC ఫీచర్‌లు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈశాన్య సంస్థలు, కొన్ని వర్గాల సంస్థలకు యూనివర్సల్ ఖాతా నంబర్ (UAN) జారీ చేసింది. ఆధార్‌తో UAN నెంబర్ లింక్ చేయడానికి గడువు డిసెంబర్ 31, 2021 వరకు పొడిగించారు. సామాజిక భద్రతా కోడ్ సెక్షన్ 142 ప్రకారం ఆధార్‌తో PF ఖాతాను లింక్ చేయడం తప్పనిసరి. మీ UANతో మీ ఆధార్ లింక్ చేయకపోతే మీ EPF ఖాతాలో మీ యజమాని నెలవారీ PF చందా జమ చేయలేరు. అలాగే, లింకింగ్ పూర్తయ్యే వరకు, మీరు మీ EPF ఫండ్ నుంచి లోన్ తీసుకోలేరు లేదా విత్‌డ్రా చేయలేరు.

Read Also.. Stock Market: స్టాక్స్‎లో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఈ ఐదు విషయాలు గుర్తుంచుకోండి..