
నమో భారత్ రైలులో ప్రయాణించేవారు తమ లాయల్టీ పాయింట్లను రీడిమ్ చేసుకోవడం ద్వారా ఉచిత ప్రయాణం పొందవచ్చు. ఎన్‌సీఆర్‌టీసీ ఇటీవల ప్రవేశపెట్టిన లాయల్టీ పాయింట్ల ప్రోగ్రామ్ కింద ఈ అవకాశం లభిస్తుంది. నమో భారత్ యాప్ ద్వారా డిజిటల్ క్యూఆర్ టికెట్‌ను జనరేట్ చేసినప్పుడు, లేదా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు (ఎన్‌సీఎంసీ)ను ఉపయోగించి ప్రయాణించినప్పుడు లాయల్టీ పాయింట్లు ప్రయాణికులకు లభిస్తాయి.
నమో భారత్ రైలులో ప్రయాణం చేసేటప్పుడు ప్రతి రూపాయికి ఒక లాయల్టీ పాయింట్ అందిస్తారు. దాని విలువ రూ.పది పైసలు ఉంటుంది. అంటే ఒక్క రూపాయి అవ్వడానికి పది పాయింట్లు అవసరం. ఇలా 300 పాయింట్లు వచ్చిన తర్వాత ప్రయాణికుడు వాటిని ఉచిత ప్రయాణం కోసం రీడిమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రయాణానికి రూ.వంద ఖర్చు చేస్తే, అతడికి రూ.10కి సమానమైన 100 పాయింట్లు అందుతాయి. అవన్నీ అతడి ఎన్‌సీఎంసీ ఖాతాలో జమ అవుతాయి.
లాయల్టీ పాయింట్లను రీడిమ్ చేసుకోవడం ద్వారా ప్రయాణికులు తమ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. వారు ఎంచుకున్న స్టేషన్ల మధ్య చార్జీ ప్రకారం పాయింట్లను తీసివేస్తారు. ఒక పాయింట్ విలువ పది పైసలు కాబట్టి, 300 పాయింట్లు వచ్చాక మీ ఖాతాలో రూ.30 విలువైన లాయల్టీ పాయింట్లు ఉంటాయి. అప్పుడే వాటిని రీడిమ్ చేసుకోగలరు. అలాగే ఐదు ట్రిప్పులకు ఒకేసారి రీడిమ్ చేసుకునే నిబంధన కూడా అమల్లో ఉంది. ఈ ట్రిప్పులు ఏడు రోజుల పాటు చెల్లుబాటులో ఉంటాయి.
నమో భారత్ యాప్ ద్వారా లాయల్టీ పాయింట్లను ట్రాక్ చేసి, చాలా సులభంగా వినియోగించుకోవచ్చు. దాని కోసం ఈ కింద తెలిపిన పద్ధతులను పాటించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి