Paytm IPO: త్వరలో పేటీఎం ఐపీఓ.. ఎప్పుడు వస్తుందంటే..

|

Oct 06, 2021 | 9:53 PM

త్వరలో పేటీఎం ఐపీఓ రాబోతుంది. ఈ ఐపీఓపై విదేశీ విపరీతమైన ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. సాధ్యమైనంత వాటా దక్కించుకోవాలని చూస్తున్నారు...

Paytm IPO: త్వరలో పేటీఎం ఐపీఓ.. ఎప్పుడు వస్తుందంటే..
Lic Ipo
Follow us on

త్వరలో పేటీఎం ఐపీఓ రాబోతుంది. ఈ ఐపీఓపై విదేశీ విపరీతమైన ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. సాధ్యమైనంత వాటా దక్కించుకోవాలని చూస్తున్నారు. ఒక భారీ వెల్త్‌ ఫండ్‎తో పాటు కొన్ని విదేశీ సంస్థాగత పెట్టుబడి కంపెనీలు ఈ రాబోయే ఇష్యూపై ఆసక్తితో ఉన్నాయి. 20-22 బిలియన్ల డాలర్ల వాల్యుయేషన్ రేంజ్‌లో అవి బలమైన ఆసక్తిని కనబరుస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సదరు అతి పెద్ద వెల్త్‌ ఫండ్‌, ఐపీవోలో 500 మిలియన్లు డాలర్లకుపైగా విలువైన షేర్లు కొంటామని ఆఫర్‌ కూడా చేసినట్లు తెలుస్తోంది. దీపావళికి ముందు పేటీఎం ఐపీఓ వచ్చే అవకాశం ఉంది. ఈ వారంలోనే సెబీ అనుమతి వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.

రూ. 16,600 కోట్ల ఫ్రెష్‌ ఇష్యూ, రూ. 8,300 కోట్ల ఆఫర్‌ ఫల్‌ సేల్‌తో పేటీఎం తన డీఆర్‌హెచ్‌పీని జులైలో దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రీ-ఐపీవో రౌండ్‌లో రూ. 2 వేల కోట్ల సేకరణ జరగనుంది. పెట్టుబడిదారుల అవసరాలు, పన్ను చిక్కులు, లాక్-ఇన్ పీరియడ్ వంటి వివిధ అంశాలపై ఇది ఆధారపడినందున, ప్రీ-ఐపీవో పరిమాణంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ, ఇతర వాటాదారులు తమ స్టేక్‌లో కొంతభాగాన్ని ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. ఎలివేషన్ 17.65 % తో, సాఫ్ట్ బ్యాంక్ 18.73 % తో, యాంట్ అండ్ అలీబాబా 38 % తో కీలక పెట్టుబడిదారులుగా ఉన్నారు. విజయ్ శేఖర్ శర్మకు 15 % వాటా ఉంది. ప్రొఫెషనల్ మేనేజ్డ్ కంపెనీగా ఉండటానికి పేటీఎం యోచిస్తున్నందున, లిస్టింగ్‌ తర్వాత విజయ్ శేఖర్ శర్మ ప్రమోటర్‌గా మారనున్నారు. స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కాకముందే రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ప్రీ ఐపీఓ అన్ లిస్టెడ్ షేర్లను కొనుగోలు చేసే వీలు ఉంది. అయితే లిస్టింగ్ అయిన ఆరు నెలల వరకు వాటిని విక్రయించేందుకు వీలుండదు.

Read Also.. Senior Citizens: వయోజనులకు అద్భుతమైన ఆదాయాన్ని అందించే సూపర్ పెట్టుబడి పథకాలు ఇవే