2021-22లో భారతదేశంలోకి 83.57 బిలియన్ డాలర్ల వార్షిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) వచ్చాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. 2020-21లో ఇన్‌ఫ్లో $81.97 బిలియన్‌గా ఉన్నట్లు వెల్లడించింది. తయారీ(manifucturing) రంగంలో విదేశీ పెట్టుబడులకు ప్రాధాన్యత కలిగిన దేశంగా భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 2020-21 ($12.09 బిలియన్లు)తో పోలిస్తే 2021-22లో ($21.34 బిలియన్లు) తయారీ రంగాలలో ఎఫ్‌డిఐ ఈక్విటీ ప్రవాహం 76 శాతం పెరిగింది. టాప్ ఇన్వెస్టర్ దేశాల విషయంలో సింగపూర్(Singapoor) 27 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, అమెరికా (18 శాతం), మారిషస్ (16 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
డేటా ప్రకారం కోవిడ్ మహమ్మారి అనంతర ఎఫ్‌డిఐ ఇన్‌ఫ్లో 23 శాతం పెరిగింది. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ గరిష్ట నిధుల ప్రవాహాలను ఆకర్షించాయి. సేవల రంగం, ఆటోమొబైల్ పరిశ్రమ దీనిని అనుసరించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. సులభంగా వ్యాపారం చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఎఫ్‌డిఐ విధానాన్ని మరింత సరళీకరించడానికి, సరళీకృతం చేయడానికి, బొగ్గు గనులు, కాంట్రాక్ట్ తయారీ, డిజిటల్ మీడియా, సింగిల్-బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్, పౌర విమానయానం, రక్షణ, బీమా, టెలికాం వంటి రంగాలలో ఇటీవల సంస్కరణలు చేశారు.
మరిన్ని బిజినెస్ ఇక్కడ క్లిక్ చేయండి..